నేలపై లాక్ డౌన్ ఉందని…ఆకాశంలో 161 మంది బంధువులతో పెళ్లి చేసుకున్నారు ఆ జంట.! (వీడియో)

నేలపై లాక్ డౌన్ ఉందని…ఆకాశంలో 161 మంది బంధువులతో పెళ్లి చేసుకున్నారు ఆ జంట.! (వీడియో)

by Anudeep

Ads

కరోనా మహమ్మారి పీడిస్తున్న ఈ గడ్డు కాలం లో ప్రభుత్వాలు లాక్ డౌన్ ను విధించి నియమాలను కఠినం గా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో పలువురు పెళ్లి వాయిదా వేసుకోక తప్పడం లేదు.. అయితే..వాయిదా వేసుకోలేని పరిస్థితిలో పరిమిత సంఖ్యలోనే కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకుంటున్నారు కొందరు జంటలు. కానీ.. ఈ జంట మాత్రం అందుకు భిన్నం.

Video Advertisement

madurai couple 1

కరోనా కారణం గా ఎక్కువ మందిని అనుమతించడం లేదని భావించిన ఈ జంట భూమి మీద కాకుండా ఆకాశం లో పెళ్లి చేసుకోవాలని భావించింది. అందుకోసం ఏర్పాట్లు కూడా చేసుకుంది. బంధు మిత్రులందరిని ఫ్లైట్ లో ఎక్కించుకుని గగన తలం బంధుమిత్రులందరి సమక్షం లో ఈ జంట ఒక్కటయ్యారు. మధురై కి చెందిన రాకేష్, దక్షిణ జంట ఏరోప్లేన్ ను రెండు గంటల పాటు రెంట్ కి తీసుకుని వారి వివాహాన్ని చేసుకున్నారు.

madhurai couple 2

ఏరోప్లేన్ లో వీరి వివాహానికి 161 మంది బంధువులు హాజరు అయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన అనుమతి ప్రకారం 50 మంది పెళ్లి కి హాజరు అవ్వాల్సి ఉండగా.. వీరు నిబంధనలకు విరుద్ధం గా వివాహం చేసుకున్నారు. ఆదివారం ఉదయం ఏడు గంటల సమయం లో మధురై ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన వారి పెళ్లి విమానం తంతు పూర్తి అయ్యేవరకు మీనాక్షి అమ్మ వారి టెంపుల్ చుట్టూ చక్కర్లు కొట్టింది. వీరి పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. ఏ ఫొటోలోని ఎవరికి మాస్కు లు లేవు. సోషల్ డిస్టెన్స్ వంటి నిబంధనలను కూడా ఉల్లంఘించారని తెలుస్తోంది.

పోలీసు సూపరింటెండెంట్‌గా ఉన్న సుజిత్ కుమార్ దీనిని “తీవ్రమైన ఉల్లంఘన” అని పేర్కొన్నారు. నగరంలో లేదా గ్రామీణ పరిమితుల్లో కేసు నమోదు చేయాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. ఇంకా, ఈ సామూహిక సమావేశానికి వివరణ ఇవ్వాల్సింది గా ఎయిర్ లైన్స్ సర్వీసెస్ ని కోరారు.

Watch Video:


End of Article

You may also like