Ads
కరోనా మహమ్మారిని అంతమొందించాలంటే వాక్సిన్ ఒక్కటే మార్గం. ఒకళ్ళు..ఇద్దరు కాదు ప్రజలందరూ వాక్సిన్ ను వేసుకుంటేనే ఈ కరోనా మహమ్మారిని అంతమొందించగలుగుతాము. అయితే వాక్సిన్ పై చాలా మందికి అపోహలు ఉన్నాయి. ముఖ్యం గా గ్రామీణ ప్రాంతం లో ఉండే ప్రజలు టీకా పై ఉన్న అపోహలతో వాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇటీవల.. ఉత్తరప్రదేశ్ లో బరాబంకి జిల్లాలోని సిసోడా అనే ఊరిలో ప్రజలు మూకుమ్మడిగా వాక్సిన్ ను తిరస్కరించారు.
Video Advertisement
వాక్సిన్ వేయించడానికి వచ్చిన అధికారుల్ని తిప్పి పంపారు. మేము వాక్సిన్ వేయించుకుంటే సంసారానికి పనికిరామని.. వాక్సిన్ వేస్తె నదిలోకి దూకేస్తామని హెచ్చరించారు. కొందరైతే టీకాలు వేయించుకున్నాక చనిపోయిన వారి గురించి చెప్పుకొచ్చారు. టీకా భయం తో దాదాపు 200 ల మంది ఊరి నుంచి పారిపోయారట. ఈ గ్రామం లో 1,500 మంది నివసిస్తున్నారు. వీరికి ఉన్న అపోహల కారణంగా వాక్సిన్ ను తిరస్కరిస్తున్నారు. వీరి అపోహలను తొలగించి.. వాక్సిన్ పై వీరికి అవగాహనా కల్పిస్తామని నోడల్ ఆఫీసర్ రాహుల్ త్రిపాఠి చెప్పుకొచ్చారు.
End of Article