Ads
ఒక సినిమాలో మనమందరం ముందుగా గమనించేది ఆ హీరో హీరోయిన్ లుక్. అయితే వారు సినిమాల్లో మాత్రమే కాకుండా బయట కూడా ఎంతో స్టైలిష్ గా రెడీ అవుతారు. దానికి కారణం స్టైలిస్ట్స్. అలా మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది హీరో, హీరోయిన్లకి స్టైల్ చేసే స్టైలిస్ట్ లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 నీరజ కోన
నీరజ కోన పర్సనల్ స్టైలిస్ట్ గా మాత్రమే కాకుండా, కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా ఎన్నో సినిమాలకు పని చేశారు. సమంత, లక్ష్మి మంచు, రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి, రీతువర్మ ఇలా ఎంతో మందికి పర్సనల్ స్టైలిస్ట్ గా వ్యవహరించారు నీరజ కోన. గుండెజారి గల్లంతయ్యిందే, నిన్నుకోరి, అత్తారింటికి దారేది సినిమాలో సమంతకి, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, ఇలా ఎన్నో సినిమాలకి స్టైలిస్ట్ గా చేశారు.
#2 అశ్విన్ మావ్లే
జూనియర్ ఎన్టీఆర్, నితిన్, అల్లు అర్జున్, ఇలా ఎంతో మంది హీరోలకి స్టైలిస్ట్ గా చేశారు అశ్విన్. అలాగే తొలి ప్రేమ, పడి పడి లేచే మనసు తో పాటు ఇంకా ఎన్నో సినిమాలకి కూడా కాస్ట్యూమ్ డిజైనర్ గా చేశారు.
#3 గీతిక చడ్డా
గీతిక రకుల్ ప్రీత్ సింగ్, రానా దగ్గుబాటికి స్టైలిస్ట్ గా వ్యవహరించారు.
#4 నితిషా శ్రీరామ్
నితిషా కూడా రాశి ఖన్నాతో పాటు, ఇంకా కొంత మంది నటులకి, అలాగే నమ్రత శిరోద్కర్ కి కూడా స్టైలిస్ట్ గా వ్యవహరించారు.
#5 హర్మన్ కౌర్
హర్మన్ కౌర్, విజయ్ దేవరకొండ, అఖిల్, రామ్, ప్రణీత సుభాష్, అల్లు అర్జున్ కి స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
#6 ప్రీతం జుకాల్కర్
ప్రీతం జుకాల్కర్ సమంతతో పాటు నిహారిక కొణిదెల, లావణ్య త్రిపాఠికి స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్నారు.
#7 పల్లవి సింగ్
మీలో ఎవరు కోటీశ్వరుడు సమయంలో నాగార్జున కి స్టైల్ చేశారు పల్లవి సింగ్. అలాగే అఆ, జనతా గ్యారేజ్, అదిరింది సినిమాల్లో సమంతకి, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కి, సర్కార్ సినిమాలో విజయ్ కి ఇంకా ఎంతో మందికి స్టైలింగ్ చేశారు పల్లవి సింగ్.
#8 అర్చా మెహతా
అర్చా మెహతా గత కొన్ని సంవత్సరాల నుండి కాజల్ కి చాలా సినిమాల్లో స్టైలింగ్ చేశారు. అలాగే రాశి ఖన్నా, క్యాథరిన్ తెరిసా, కాజల్ అగర్వాల్ కి పర్సనల్ స్టైలిస్ట్ గా కూడా ఉన్నారు.
#9 శ్రావ్య వర్మ
విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, రష్మిక మందన వీళ్ళందరికీ స్టైలిస్ట్ గా వ్యవహరిస్తారు శ్రావ్య వర్మ.
#10 అక్షయ్ త్యాగి
మహేష్ బాబుకి పర్సనల్ స్టైలిస్ట్ అక్షయ్ త్యాగి. శ్రీమంతుడు నుంచి అన్ని సినిమాలకు మహేష్ బాబుకి స్టైలింగ్ చేశారు అక్షయ్ త్యాగి.
#11 ఇంద్రాక్షి పట్నాయక్
ఇంద్రాక్షీ పట్నాయక్ మహానటి సినిమాకి స్టైలిస్ట్ గా వ్యవహరించడంతో పాటు, ఎంతో మంది హీరో హీరోయిన్లకు పర్సనల్ స్టైలిస్ట్ గా ఉన్నారు.
#12 శ్వేత మల్పాని
శ్వేత, లక్ష్మీ మంచు, మెహరీన్ తోపాటు, ఇంకా ఎంతోమంది హీరోయిన్లకి స్టైలింగ్ చేశారు.
End of Article