Ads
రతన్ టాటా గారికి భారత రత్న బిరుదు ఎందుకు రాలేదో తెలియదు కానీ.. “భారత రత్న” ఇవ్వాల్సిన వాళ్ళ పేరు లో ఆయనే ముందు వరసలో ఉంటారు. ఆయన సంపాదన ఎన్ని వేల కోట్లలో ఉంటుందో చెప్పలేం. కానీ… ఏ ఒక్క సారి ఆయన పేరు అత్యధిక ధనికుల జాబితా లో ఉండదు. ఎందుకంటే.. ఆయన తన సంపాదనలో ఎక్కువ మొత్తం ఈ దేశ ప్రజల కోసమే వినియోగిస్తూ ఉంటారు.
Video Advertisement
తాజాగా..ఈ కరోనా గడ్డు కాలం లో ఆయన మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. కరోనా కారణం గా టాటా కంపెనీ లో ఎవరైనా ఉద్యోగి కరోనా కారణం గా మరణిస్తే.. అతని జీతాన్ని నెల నెలా అతని కుటుంబానికే అందచేయనున్నారు. అతని కి రిటైర్మెంట్ వయసు అంటే అతను ఉన్న వయసు నుంచి.. 60 ఏళ్ల వయసు వరకు అతని జీతాన్ని కుటుంబానికి అందచేస్తారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ లో ఎవరైనా చనిపోతే.. వారికి జీతం ఇవ్వడం తో పాటు.. వారి పిల్లల చదువు బాధ్యతలను కూడా కంపెనీ నే తీసుకుంటుందని పేర్కొన్నారు. ఎంతైనా గ్రేట్ కదా..
End of Article