Home Filmy Adda “దేవుడిని ఎందుకు పూజిస్తున్నారు..?” ఖరోనా ను తీసుకెళ్లి దేవుడికే లంకె పెట్టిన ఆర్జీవీ..!

“దేవుడిని ఎందుకు పూజిస్తున్నారు..?” ఖరోనా ను తీసుకెళ్లి దేవుడికే లంకె పెట్టిన ఆర్జీవీ..!

by Anudeep

కరోనా మహమ్మారి ప్రస్తుతం భారత్ లో ఉధృతం గా ఉంది. అయితే.. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సారి కరోనా మహమ్మారి పై ట్వీట్ వేశారు. ప్రతి విషయాన్నీ వ్యంగం గా తీసుకుని మాట్లాడే ఆర్జీవీ ఈ సారి కూడా తన వ్యంగ్యాన్ని ప్రదర్శించారు. కరోనా మహమ్మారి తో ప్రజలు అల్లాడుతూ.. కాపాడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. ఈ మహమ్మారి నుంచి దేవుడొక్కడే కాపాడగలడని భావిస్తున్నారు.

rgv tweet

ఈ విషయమై ట్వీట్ చేసిన వర్మ ” ఈ లోకం లో ప్రతి సృష్టికి కారణం ఆ దేవుడే.. మరి అలాంటప్పుడు కరోనా ను సృష్టించింది కూడా ఆ భగవంతుడే. అలాంటి దేవుడిని ఎందుకు పూజిస్తున్నారు..” అంటూ ట్వీట్ వేశారు. దీనిపై నెటిజన్లు కూడా ఘాటు గానే స్పందిస్తున్నారు. వర్మ తాను నాస్తికుడని.. ఏ విషయాలు పట్టించుకోడని మరో సారి రుజువైంది.

You may also like