Ads
పెళ్లి అయిన తరువాత సొంత కుటుంబం లో వచ్చే అసంతృప్తి కి దారి తీసే పరిస్థితులు ఒక్కోసారి ఇబ్బందికరం గా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే అక్రమ సంబంధాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. తాజాగా, వనపర్తి జిల్లా కు చెందిన ఓ మహిళ తన భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో కలిసి జీవించాలని కోరుకుంది. ఇంతకీ అసలేమీ జరిగిందో చూద్దాం.
Video Advertisement
వనపర్తి జిల్లాలో అమరచింత కు చెందిన సుజాత కు ఆల్రెడీ పెళ్లి అయింది. ఆమెకు ఏడేళ్ల కూతురు, పదేళ్ల వయసున్న కొడుకు ఉన్నారు. అయితే వారు నివసిస్తున్న కాలనీ లోనే నివాసం ఉంటున్న రాకేష్ అనే వ్యక్తి తో సుజాత కు పరిచయం అయింది.ఆ పరిచయం కాస్త ప్రేమ గా మారింది. ఈ క్రమం లో వారిద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. ఈ మోజులోనే ఉన్న సుజాత కూడా భర్తని, పిల్లలని వదిలేసి.. దాదాపు నెల క్రితమే రాకేష్ తో కాపురం పెట్టుకుంది.
వారిద్దరూ భార్యాభర్తలమని చెప్పుకుంటూ వరంగల్ లో కాపురం ఉంటున్నారు. ఈ క్రమం లో ఇరు కుటుంబాల తల్లి తండ్రులు వారికోసం వెతికారు. చివరకు వరంగల్ లో ఉన్నట్లు తెలుసుకున్నారు. రాకేష్ కుటుంబ సభ్యులు ఈ నెల 21 న వరంగల్ కు వెళ్లి వారిద్దరిని ఒప్పించి అమరచింత కు తీసుకొచ్చారు. సుజాత ను భర్త వద్ద దింపేసి.. వెళ్లిపోయారు. ఆ తరువాత, సుజాత అమరచింత పోలీస్ స్టేషన్ కు వచ్చి.. తాను రాకేష్ తోనే ఉంటానని.. రాకేష్ ను ఎక్కడో తెలియకుండా బంధించారని, ఫోన్ కూడా ఇవ్వలేదు అని స్టేషన్ లో కేసు పెట్టింది. సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేసారు.
End of Article