లాటరీ తగలట్లేదని టికెట్ ను విసిరికొట్టింది.. ఆ టికెట్ కె రూ.7.3 కోట్ల లాటరీ… చివరికేమైందంటే..?

లాటరీ తగలట్లేదని టికెట్ ను విసిరికొట్టింది.. ఆ టికెట్ కె రూ.7.3 కోట్ల లాటరీ… చివరికేమైందంటే..?

by Anudeep

Ads

లాటరీ పై చాలామందికి నమ్మకం ఉంటుంది. ఒక్కసారి కూడా లాటరీ రాకపోతే నిరాశ వస్తూనే ఉంటుంది. అయితే.. లీ రోజ్‌ ఫిగా అనే మహిళ ‘లక్కీ స్టాప్‌’ పేరుతొ ఉన్న ఓ షాప్ లో లాటరి కొనుగోలు చేసింది. ఆ షాప్ ను ఓ భారతీయ కుటుంబం నిర్వహిస్తోంది. అయితే.. ఆమె ఎప్పటిలానే లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. ఐతే.. ఆ టికెట్ ను స్క్రాచ్ చేసి పరధ్యానం గా చూసింది. ఆమె పూర్తి గా స్క్రాచ్ చేయకుండా.. తనకు తగల్లేదు అనుకుని ఆ టికెట్ ను చెత్తబుట్టలో పడేసింది.

Video Advertisement

lottery ticket

ఆ తరువాత అక్కడనుంచి వెళ్ళిపోయింది. పదిరోజులు ఆ టికెట్ చెత్తబుట్టలోనే ఉంది. అయితే ఆ షాప్ ఓనర్ యజమాని కుమారుడు అభి షా ఆ టికెట్ ను చూసాడు. పూర్తి గా స్క్రాచ్ చేసి చూడగా.. ఆ టికెట్ కు లాటరీ వచ్చిందని తెలుసుకున్నాడు. తనకు లాటరీ సొంతమైందని అభి సంతోషించాడు. అతని తండ్రికి, నయనమ్మలకు కూడా తెలిపాడు. అయితే.. వారు మాత్రం ఆ సొమ్ము తీసుకోవద్దని.. టికెట్ కొన్నవారికే ఇవ్వాలని సూచించారు. దీనితో.. లీ రోజ్‌ ఫిగాకు ఈ విషయం చెప్పారు. ఆమె మొదట షాక్ అయింది. తరువాత ఏడ్చేసింది. ఆ తరువాత టికెట్ తీసుకుని లాటరీ ని పొందింది. ఈ భారతీయ ఫ్యామిలీని పలువురు ప్రశంసిస్తున్నారు. టివి ఛానెల్స్ సైతం వారిని ఇంటర్వ్యూ చేస్తున్నాయి.


End of Article

You may also like