Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆనందయ్య ఆయుర్వేద వైద్యం గురించే చర్చ జరుగుతోంది. నెల్లూరు కృష్ణ పట్నం వద్ద గత కొన్ని రోజులుగా ఆనందయ్య అనే వ్యక్తి తన తాతలకాలం నుంచి నేర్చుకున్న మందుని అందరికి ఉచితం గా అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయనలానే మరికొందరు కూడా ఈ వైద్యం తెలిసిన వారు ముందుకు వస్తున్నారు. రాజమండ్రి లో కూడా ఓ వ్యక్తి ఇలానే వైద్యం చేస్తున్నారు.
Video Advertisement
తాజాగా.. తెలంగాణ లో మంచిర్యాల జిల్లా మందమర్రి మండలానికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు బచ్చలి భీమయ్య కూడా ఆయుర్వేదం మందుని ఇస్తున్నారు. ఈయన కూడా ఆనందయ్య లానే ఉచితం గా మందును ఇస్తూ కరోనా రోగులలో భరోసా కల్పిస్తున్నారు. గతం లో కూడా ఇరవై ఏళ్లుగా భీమయ్య ఆదివారం రోజుల్లో చుట్టూ పక్కల వారికి తనకు తెలిసిన ఆయుర్వేద వైద్యం చేసేవారు. ప్రస్తుతం కూడా అందరికి ఉచితం గా మందు ఇస్తుండడం తో.. ఆ నోటా ఈ నోటా పడి భీమయ్య కు సోషల్ మీడియా లో కూడా మద్దతు లభించింది. ఈ క్రమం లో బచ్చలి భీమయ్య ను పోలీసులు అదుపులోకి తీసుకుని అనుమతులు లేకుండా ఇలా మందు పంపిణి చేయకూడదంటూ పంపిణి ని నిలిపివేశారు.. అయితే స్థానికులు మాత్రం మందు పంపిణి కి అనుమతి ఇవ్వాలంటూ కోరుతున్నారు. ప్రభుత్వం అనుమతిస్తే తానూ పంపిణి చేస్తానని ఆనందయ్య చెబుతున్నాడు.
Note: Image used is for reference purposes only.
End of Article