Ads
కరోనా మహమ్మారి ఎంతగా వ్యాప్తి చెందుతోందో తెలుస్తూనే ఉంది. పలువురికి ఆసుపత్రుల్లో బెడ్స్ కూడా దొరకడం లేదు. ఈ పరిస్థితిలో బెడ్ దొరికే దాకా బయటే నిలబడాల్సిన పరిస్థితి చాలా కోవిడ్ కేర్ సెంటర్ల దగ్గర కనిపిస్తోంది. ఈ క్రమం లో కర్ణాటకలోని దావంగెరె జిల్లాలోని న్యామతి కోవిడ్ కేర్ సెంటర్‌లో ప్రస్తుతం 180 మంది కోవిడ్ పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ కేర్ సెంటర్ బయట కూడా పలువురు రోగులు చికిత్స కోసం ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
వీరిలో ఆత్మస్థైర్యం నింపడం కోసం హోన్నాలి ఎమ్మెల్యే రేణుకాచార్య మరియు అతని భార్య సుమా రేణుకాచార్య వారితో కలిసి కోవిడ్ కేర్ సెంటర్ వెలుపల డాన్స్ చేసారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ జంట కొన్ని కన్నడ హిట్స్ ప్లే చేస్తూ రోగులతో కలిసి డాన్స్ చేసారు.
End of Article