Ads
వ్యాక్సినేషన్ పూర్తి అయిన తరువాత మనకు ఇచ్చే సర్టిఫికెట్ లను సోషల్ మీడియా లో పోస్ట్ చేయకూడదంటూ ప్రభుత్వం సూచిస్తోంది. ఎందుకంటే.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లలో మన పర్సనల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఈ డీటెయిల్స్ ను పబ్లిక్ గా సోషల్ మీడియా లో పెట్టడం అంత శ్రేయస్కరం కాదని ప్రభుత్వం సూచిస్తోంది.
Video Advertisement
వాస్తవానికి, వ్యాక్సినేషన్ పూర్తి అయ్యాక అందరికి చెప్పుకోవడం మంచిదే.. ఎందుకంటే అది మరికొంత మందికి స్ఫూర్తిదాయకం గా నిలుస్తుంది. కానీ.. సర్టిఫికెట్ పోస్ట్ చేయడం వలన మన పర్సనల్ డీటెయిల్స్ పై ఇతరుల దృష్టి పడే అవకాశం ఉంటుంది. అందుకే ఇటువంటి విషయాలలో జాగ్రత్త తప్పనిసరి. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) తన సైబర్-భద్రత మరియు సైబర్ సెక్యూరిటీ అవగాహన కు సంబంధించి ట్విట్టర్ లో ఓ పోస్ట్ ను షేర్ చేసింది.. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ను సోషల్ మీడియా లో పంచుకునే విషయమై జాగ్రత్త పాటించాలని కోరింది.
Beware of sharing #vaccination certificate on social media: pic.twitter.com/Tt9vJZj2YK
— Cyber Dost (@Cyberdost) May 25, 2021
End of Article