ఐసోలేషన్ కేంద్రం లోనే పెళ్లి చేసేసుకున్నారు..!

ఐసోలేషన్ కేంద్రం లోనే పెళ్లి చేసేసుకున్నారు..!

by Anudeep

Ads

కరోనా సెకండ్ వేవ్ తో ప్రస్తుతం దేశం లో పరిస్థితి ఇబ్బందికరం గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారిని కట్టడి చేయడం కోసం కర్ఫ్యూ ని అమలు చేస్తున్నారు. మరో వైపు ప్రజల నిత్యావసరాలకు ఇబ్బంది రాకూడదని కొంత సమయాన్ని సడలిస్తున్నారు. ఈ క్రమం లో కొందరు వచ్చిన బంధువులతోనే వివాహ వేడుకల్ని కానిచ్చేస్తున్నారు.

Video Advertisement

wedding

ఇటీవల ఓ జంట ఐసోలేషన్ కేంద్రం లో పెళ్లి చేసుకున్నారు. వారేమి కరోనా సోకడం వలన ఐసోలేషన్ లో లేరు.. గ్రామస్తుల కోసం.. మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఏర్పాటు చేయబడ్డ ఐసోలేషన్ కేంద్రం లోనే ఈ జంట వివాహ వేడుకని కానిచ్చేశారు. తూర్పు గోదావరి జిల్లా కరప లో చిరంజీవి కళ్యాణమంటపం దిగువ భాగం లో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. అయితే ఎవరు పట్టించుకోకపోవడం తో.. వీరు పై అంతస్తులో వివాహ వేడుక ను చేసుకున్నారు. ఆ సమయం లో కింద ఎవరు కరోనా రోగులు లేకపోవడం కొంత అదృష్టం.


End of Article

You may also like