Ads
ఎక్కడైనా నిమిషాల తేడాతో కవలలని కనడం చూస్తూనే ఉంటాం. కానీ.. ఇది వింతల్లోనే వింత. ఓ మహిళ రెండు వేరువేరు సంవత్సరాలలో.. వేరు వేరు దశాబ్దాల్లో.. ముగ్గురు పిల్లలను కంది. వారి మధ్య కేవలం ఐదు రోజులే తేడా.. ఇదెలా సాధ్యం అంటారా..? ఇది పూర్తి గా చదవండి. కైలీ డిషేన్ అనే మహిళ డిసెంబర్ 28 న ప్రసవించింది. ఆమె వయసు 33 సంవత్సరాలు. ఆమె కడుపు లో ట్రిప్లెట్స్ పెరుగుతున్నారని తెలుసుకుంది.
Video Advertisement
మొదట ఆశ్చర్యపోయిన జాగ్రత్త పడింది. ఐతే మొదట ఒక బేబీ ఆరవ నెలలోనే డిసెంబర్ 28 న జన్మించింది. ఆ తరువాత 2020 జనవరి 2 వ తేదీన కవలలకు జన్మనిచ్చింది. పిల్లలు ముగ్గురు ఒకేసారి ఐదు రోజుల తేడా తో బయటకు వచ్చారు. ప్రీ డెలివరీ అవడం తో వారిని ఐసీయూ లో ఉంచి రక్షణ కల్పించారు. అయితే.. ఒక బేబీ ని 2019 లో ఇద్దరు బేబీ లను 2020 లో ప్రసవించింది. ఈ లెక్కన వీరు ముగ్గురు వేరు వేరు సంవత్సరాలలో.. వేరు వేరు దశాబ్దాలలో జన్మించినట్లే కదా.. అదన్నమాట సంగతి. ప్రస్తుతం వీరు ఆరోగ్యం గానే ఉన్నారు. కైలీ కి వరల్డ్ రికార్డు సొంతమైంది.
End of Article