Ads
కరోనా మహమ్మారి కారణం గా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయో లెక్క లేదు. సాధారణ వ్యక్తుల సంగతి ఎలా ఉన్న.. గర్భిణులు మాత్రం మరింత జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది. ఇటీవల గర్భం తో ఉన్న వారికి పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పటికీ.. పిల్లలకు నెగటివ్ రావడం తో ఊపిరి పీల్చుకుంటున్నారు.
Video Advertisement
అయితే.. వారణాసి లో మాత్రం ఇందుకు భిన్నం గా కనిపించింది. సుప్రియ అనే మహిళా మే 24 న ఆసుపత్రి లో అడ్మిట్ అయ్యారు. ఆమెకు కరోనా టెస్ట్ చేయగా నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆమెకు నెగటివ్ రిపోర్ట్ వచ్చిన మరుసటి రోజే డెలివరీ అయింది. అయితే.. పుట్టిన బిడ్డకు ఆర్టీ పిసిఆర్ టెస్ట్ చేయగా పాజిటివ్ రిపోర్ట్ రావడం తో వైద్యులు షాకయ్యారు. ఇటువంటి కేసులు కూడా నమోదవుతున్నాయి. తల్లికి నెగటివ్ ఉన్నప్పటికీ బిడ్డకు పాజిటివ్ రావడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే.
End of Article