రోజు లానే పొలం దున్నాడు.. ఆ రోజు మాత్రం దశ తిరిగింది.. ఏమైందంటే..?

రోజు లానే పొలం దున్నాడు.. ఆ రోజు మాత్రం దశ తిరిగింది.. ఏమైందంటే..?

by Anudeep

Ads

కర్నూల్ జిల్లా ను వెనకబడ్డ ప్రాంతం అని అంటున్నా.. ఆ జిల్లాకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. కర్నూలు జిల్లా, తుగ్గలి మరియు ఆ చుట్టూ పక్కల ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. మీరు విన్నది నిజమే.. వర్షాలు పడి ఆగినప్పుడు ఒక్కోసారి ఆ నెలలో చిన్నవి.. పెద్దవి వజ్రపు రాళ్లు దొరుకుతూ ఉంటాయి.

Video Advertisement

farmer

తాజాగా, తుగ్గలి మండలానికి చెందిన చిన్నజొన్నగిరి గ్రామానికి చెందిన రైతు వేరు సన్నగా పంట పండించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇందుకోసం పొలం దున్నుతున్న సమయం లో కంది కొయ్యలు తీస్తుండగా.. ఆ రైతుకు ఓ మెరుగు రాయి కనిపించింది. అది వజ్రం అయి ఉంటుందని ఆ రైతు గుర్తించి వజ్రాల వ్యాపారివద్దకు తీసుకెళ్లాడు. అందరి సమక్షం లో ఆ వజ్రాన్ని వేలం వేయగా.. ఓ వ్యాపారి రూ.1.20కోట్ల రూపాయలు చెల్లించి ఆ వజ్రం సొంతం చేసుకున్నాడు. ఆ రైతు దశ తిరిగిందని అందరు అనుకున్నారు. గతం లో కూడా 37 లక్షల విలువైన వజ్రం ఓ వ్యక్తికీ దొరికింది. అయితే. ఇంత విలువైన వజ్రం దొరకడం మాత్రం అరుదుగా జరిగేదే.


End of Article

You may also like