Ads
ఇటీవల టిక్ టాక్ లో వైరల్ అయిన ఓ వీడియో అందరు నెటిజన్లను ఆశ్చర్యం లో ముంచేసింది. ఓ మహిళ ఒకటి కాదు రెండు కాదు.. ఏకం గా 16 గంటలు స్నానం చేసిందట. ఆమె తన పాదాలు ఎలా ఉన్నాయో ఆ వీడియో ను షేర్ చేసింది. వాటిని తిరిగి ఎలా మాములు గా చేసుకోవాలో సలహా ఇవ్వాలని కోరింది. అయితే.. అందరు తలొక సలహా ఇచ్చినా.. ఆమె 16 గంటల పాటు స్నానం ఎందుకు చేసిందనేది అసలు ప్రశ్న గా మిగిలిపోయింది..?
Video Advertisement
పలువురు కామెంట్స్ లో కూడా ప్రశ్నించారు. “సాధారణం గా 30 నుంచి 40 నిమిషాల పాటు నీళ్లలో ఉంటేనే ఆ చల్లదనానికి జలుబు చేసే ఛాన్స్ ఉంది..మరి 16 గంటల పాటు ఏమి చేసావు..?” అంటూ ఓ నెటిజెన్ సదరు యువతీ ని ప్రశ్నించాడు. మరికొందరేమో.. ఆమె బాత్ టబ్ లో నిద్రపోయి ఉంటుంది అంటూ సమాధానాలు రాసారు. మరికొందరు ఏమో ఇది ఎడిటింగ్ అయ్యుండచ్చు అని భావించారు. కానీ.. ఆ మహిళ చేతులు కాళ్ళు మాత్రం చాలా ఇబ్బందికరం గా మారాయి.
End of Article