బెంగాల్ ఏరియల్ రివ్యూ చేసిన ప్రధాని.. అరగంట వెయిట్ చేయించిన బెంగాల్ ముఖ్యమంత్రి..!

బెంగాల్ ఏరియల్ రివ్యూ చేసిన ప్రధాని.. అరగంట వెయిట్ చేయించిన బెంగాల్ ముఖ్యమంత్రి..!

by Anudeep

Ads

యాస్ తుఫాను ప్రభావం పశ్చిమ బెంగాల్ పై కూడా పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో నష్టపడ్డ ప్రాంతాలను దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఆ తరువాత జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో సహా పలువురు అధికారులు హాజరు కావాల్సి ఉంది. అయితే, ఈ సమావేశానికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరు అయ్యారు. ఇతర అధికారులు కూడా హాజరు కాకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలుగచేసింది.

Video Advertisement

pm modi and mamatha

ఆ తరువాత కలైకుందా ఎయిర్‌బేస్‌లో కూడా అధికారుల తో పీఎం నరేంద్ర మోడీ ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి కూడా సీఎం తో పాటు ముఖ్య కార్యదర్శి హాజరు కావాల్సి ఉంది. అయితే.. ఇందుకు కూడా మమతా బెనర్జీ అరగంట ఆలస్యం గా వచ్చారట. ఓ నివేదిక ను ఇచ్చిన తరువాత ఓ పావుగంట సేపు ఉండి ఇతర కార్యక్రమాలకు వెళ్లాలంటూ.. ఆమె అక్కడనుంచి వెళ్లిపోయారట. దీనితో పలువురు రాజకీయవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇతర అధికారులు అయినా హాజరు అవ్వాల్సి ఉంది.. అయితే సీఎం మమతా ఉద్దేశ్యపూర్వకం గా నే ఇలా చేసారని పలువురు భావిస్తున్నారు.


End of Article

You may also like