Ads
నెల్లూరు కృష్ణ పట్నం ఆనందయ్య చేస్తున్న వైద్యం వలన చాలా మందికి నయమవుతోందన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ క్రమం లో కొందరు ఆనందయ్య ముందుకు శాస్త్రీయత లేదని.. కరోనా అందరికి తగ్గడం లేదు అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేసారు. నిన్న కృష్ణపట్నం నుంచి మందును తీసుకొచ్చి జగిత్యాలలో కొందరికి ఇచ్చారని.. కళ్ళలో మంటలు వచ్చాయి కానీ.. కరోనా తగ్గలేదు అంటూ ఆయన కామెంట్స్ చేసారు.
Video Advertisement
ఓ ప్రభుత్వ ఆసుపత్రి లో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే డా సంజీవ్ ఆనందయ్య ముందుకు ప్రచారం చేయవద్దంటూ కోరారు. ఓ ఎమ్మెల్యే గా, కంటి వైద్యుడి గా తానూ చెపుతున్నానని.. ఇంతటి శాస్త్ర పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక కూడా నాటు వైద్యం నమ్మడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఆనందయ్య మందు మంచి గా పని చేస్తే జగిత్యాలలో ఉన్న 45 కొవిడ్ రోగులకు కూడా ఆ మందే ఇచ్చేవాళ్లమని.. ఇంతమంది వైద్యులు, నర్సులు కష్టపడే వారు కాదు కదా అంటూ మాట్లాడారు.
End of Article