Ads
ప్రస్తుతం వ్యాక్సినేషన్ గురించి ప్రజల్లోనూ అవగాహనా పెరిగింది. కరోనా మహమ్మారి ని ఎదుర్కోవడానికి ప్రజలందరూ వాక్సిన్ వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. అయితే.. వీరిలో మద్యం తాగేవారికి ఉన్న ఏకైక సందేహం ఏమిటంటే..వాక్సిన్ తీసుకునే ముందు గాని, తరువాత కానీ మందు తాగవచ్చా..? అని. ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలంటే ఈ ఆర్టికల్ పూర్తి గా చదవండి.
Video Advertisement
ఈ విషయమై ఇప్పటికే కొంత రీసెర్చ్ జరిగింది. అయితే.. కొందరు పరిశోధకులు ఏమన్నారంటే.. వాక్సిన్ పై ఆల్కహాల్ ఎలాంటి ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. అయితే.. ఇందులోనూ ఓ లొసుగు ఉంది. ఆల్కహాల్ ప్రభావం చూపలేదు కదా.. అని వాక్సిన్ వేయించుకోగానే మందు తాగడం అనేది సరైన పద్ధతి కాదు.
వాక్సిన్ వేయించుకోవడానికి 24 నుంచి 48 గంటల ముందు గాని తరువాత కానీ మందు తాగడం వలన స్వల్పం గా ప్రభావం ఉండే అవకాశం ఉందని ఆల్కహాల్ రిసెర్చ్ కరెంట్ రివ్యూస్ అనే ఓ హెల్త్ జర్నల్ లో పేర్కొన్నారు. మందు తాగడం వలన శరీరం డీ హైడ్రాషన్ కు లోనయ్యే అవకాశం ఉంటుంది. ఆ సమయం లో శరీరం లో ఉండే వాక్సిన్ అంత గా ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు. డీ హైడ్రేషన్ వలన శరీరం నీరసించిపోతుంది. అందుకే వాక్సిన్ వేయించుకునే ముందు ఈ విషయం పరిగణనలోకి తీసుకోండి.
End of Article