Home News కాఫీ కప్ లో మూత్ర విసర్జన చేస్తూ షాకిచ్చిన కెనడా ఎంపీ..!

కాఫీ కప్ లో మూత్ర విసర్జన చేస్తూ షాకిచ్చిన కెనడా ఎంపీ..!

by Anudeep

ఇటీవల వీడియో కాల్ కాన్ఫరెన్సెస్ లో చెప్పుకోలేని సంఘటనలు కోకొల్లలు జరుగుతున్నాయి. సరిగ్గా వారం క్రిందటే కెనడా ఎంపీ విలియం అమోస్ వీడియో కాన్ఫరెన్స్ లో నగ్నం గా దర్శనమిచ్చి అందరి అటెన్షన్ ను అట్ట్రాక్ట్ చేసారు. అయితే.. మళ్ళీ ఆయన మరో సారి వార్తల్లో నిలిచారు. తాజాగా.. వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్న సమయం లో ఆయన కాఫీ కప్ లో మూత్ర విసర్జన చేస్తూ కనిపించారు.

william amos

దీనితో కాల్ లో ఉన్నవారంతా షాక్ అయ్యారు. అయితే దీనిపై స్పందించిన అమోస్.. “ఈ రెండు ఘటనలు పొరపాటు వల్లనే జరిగాయి. ఆ సమయం లో కెమెరా ఆన్ లో ఉందన్న సంగతి నేను గమనించుకోలేదు.. ఈ రెండు సంఘటనల వలన నేను ఎంబరాసింగ్ గా ఫీల్ అవుతున్నాను.. మీ అందరి సపోర్ట్ కి ధన్యుడిని.. అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నా.. ఎంపీ గా నా బాధ్యతలను నేను నిర్వర్తిస్తా..” అంటూ పేర్కొన్నారు.

You may also like