Ads
హీరోయిన్ యామి గౌతమ్ నితిన్ తో కలిసి కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా, లాక్ డౌన్ సమయం లో ఆమె వివాహం చేసుకున్నారు. ఫెయిర్ అండ్ లవ్లీ ఆడ్ తో బాగా పాపులర్ అయిన యామి గౌతమ్ ఆ తరువాత సినిమాల్లోనూ నటించారు. హిందీ సీరియల్ అండ్ సినిమాలతో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన యామి గౌతమ్ ఆ తరువాత పలు తెలుగు సినిమాల్లో కూడా నటించారు.
Video Advertisement
2011 లో నువ్విలా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు కూడా యామి గౌతమ్ దగ్గరయ్యారు. ఆ తరువాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి తెలుగు సినిమాల్లో నటించారు. ఆమె ఎక్కువ గా హిందీ సినిమాలలోనే నటించారు. తాజాగా, లాక్ డౌన్ సమయం లో సన్నిహితుల సమక్షం లో ఆమె ఆదిత్యను వివాహమాడారు. ఈ మేరకు ఆమె ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నారు. “కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తో.. వివాహ వేడుకను జరుపుకున్నాము.. మా ప్రేమ మరియు కొత్త వైవాహిక జీవితాన్ని మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నా..” అంటూ పోస్ట్ చేసారు.
End of Article