Ads
అందరికీ వారి బాల్యంలో తీపి జ్ఞాపకాలు ఉండాలి అని లేదు. కొంత మందికి వారి బాల్యం, వారి భవిష్యత్తుపై కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. తన బాల్యంలో జరిగిన ఒక సంఘటన గురించి ఒక యువతి ఇలా చెప్పింది. “అప్పుడు బాగా వరదలు వచ్చాయి. నా వయస్సు 12 సంవత్సరాలు ఉండొచ్చు. వరద నీరు ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లో వస్తువులన్నీ కొట్టుకుపోతున్నాయి.
Video Advertisement
representative image
నీరు ఎత్తు బాగా ఎక్కువ అవడంతో నేను మునిగిపోయాను. మా అమ్మ నాకోసం వెతుకుతోంది. నేను ఆ నీటిలో మునిగిపోయి కొట్టుకుపోయాను. అలా కొట్టుకుపోయిన నన్ను, ఒక వ్యక్తి బయటికి లాగి నా వివరాలు కనుక్కున్నాడు. ఆ సమయంలో నాకు ఆ వ్యక్తి నమ్మకస్తుడిగా కనిపించాడు. ఆయనకి 50 సంవత్సరాల పైన ఉంటాయి. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టిస్తాను అని చెప్పాడు.
representative image
అలాగే మా అమ్మానాన్నలని పిలిపిస్తాను అని అన్నాడు. కానీ అలా జరగలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను నాతో విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నించాడు. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి నేను అతని నుండి దూరంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే బలవంతం చేశాడు. ఆ సమయంలో నాకు ఏం చేయాలో తెలియలేదు.
representative image
తర్వాత ఇంకా కొంత మంది వచ్చి నాతో ఇలాగే ప్రవర్తించారు. తర్వాత వాళ్లు నన్ను ఎక్కడికో తీసుకెళ్లి అమ్మేయాలి అని మాట్లాడుకోవడం నేను విన్నాను. ఇంక అక్కడి నుండి పారిపోదామని నేను నిర్ణయించుకున్నాను. నా ఒంటి మీద దుస్తులు లేవు. నా చేతులు కాళ్లు కట్టేసి ఉన్నాయి. అయినా సరే నేను ఎలాగోలా విడిపించుకుని అలాగే బయటికి పరుగెత్తుకుంటూ వచ్చాను.
ఎక్కడైనా కప్పుకోవడానికి ఒక చిన్న గుడ్డ ముక్క అయినా దొరుకుతుందేమో అని వెతికాను. అలా నిస్సహాయ స్థితిలో ఉన్న నన్ను చూసిన ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి పిలిచి తన చీరను ఇచ్చింది. వరద నీరు కొంచెం తగ్గడంతో జనసంచారం మళ్లీ మామూలు అయ్యింది. నాకు చీర ఇచ్చిన ఆవిడ నాకు భోజనం పెట్టి, మా అమ్మ నాన్నల వివరాలు అడిగింది. ఈ సారి నేను చాలా భయపడ్డాను. కానీ ఆవిడ నాకు ధైర్యం చెప్పింది.
నాకు మళ్లీ నా వివరాలు చెప్పాలంటే భయమేసింది. ఆవిడ నా భయాన్ని అర్థం చేసుకుంది. కానీ నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంటికి వెళ్ళాలి. కాబట్టి నా వివరాలు ఆవిడకు చెప్పాను. ఆవిడ అప్పుడు మా అమ్మకి ఫోన్ చేసింది. నేను తన దగ్గరే ఉన్నట్టు, నన్ను మా ఇంటికి పంపిస్తున్నట్టు మా అమ్మ నాన్నలకు చెప్పింది.
నేను తిన్న తర్వాత నన్ను వాళ్ళ కార్ లో తీసుకువెళ్లి మా ఇంటి దగ్గర వదిలింది. నేను ఇంటికి వెళ్ళగానే అమ్మ నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంది. ఈ సంఘటన జరిగి చాలా సంవత్సరాలు అయినా సరే నా జీవితం మీద ఇది చాలా ప్రభావం చూపింది. ఆ భయం నుండి బయటకి రావడానికి నాకు చాలా సంవత్సరాలు పట్టింది.
NOTE: All the images used in this article are just for representative purpose. But not the actual characters
End of Article