Ads
కాలంతో పాటు మనిషి జీవనశైలి కూడా మారింది. అలవాట్లు మారాయి. ముఖ్యంగా పిల్లల విషయంలో కూడా తల్లిదండ్రుల శ్రద్ధ మారింది. అంటే అంతకు ముందు పిల్లలను పిల్లల్లాగే చూసేవాళ్ళు. వాళ్లకి ఏం తెలియదు కాబట్టి, వాళ్ల ముందు మాట్లాడేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు జాగ్రత్తగా ఉండేవారు. అలాగే వారికి విలువైన వస్తువులు ఇచ్చేవారు కాదు.
Video Advertisement
ఇంక ఫోన్ గురించి వేరే చెప్పాల్సిన అవసరమే లేదు. వారికి 14, 15 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఫోన్ పట్టుకోని పిల్లలు ఎంతో మంది ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. నెలల పిల్లలకి కూడా ఖరీదైన వస్తువులు ఇస్తున్నారు. వారి చేతిలో ఫోన్ పెడుతున్నారు. 10 సంవత్సరాల పిల్లలు అయితే వారికి ప్రపంచమంతా తెలిసినట్టే మాట్లాడుతారు.
పిల్లలు ఎప్పుడైనా ఏడ్చినా, గొడవ చేసినా వారి చేతికి ఫోన్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఫోన్ లో, యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు. చిన్న పిల్లలకి ఫోన్ ఇవ్వకూడదు అని చాలా మంది నిపుణులు చెపుతుంటారు. కానీ కొంత మంది దీనిని పాటించరు. చిన్న పిల్లలకి ఫోన్ ఇవ్వడం వల్ల ఒక్కొక్కసారి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అలాంటి సమస్యే ఇప్పుడు మీరు చదవబోయే కథ. ఒక భార్య, భర్త, వారికి ఒక బాబు. వారు ముగ్గురు హైదరాబాద్ లో నివసిస్తుంటారు. భర్త ఉద్యోగం చేస్తాడు. భార్య ఇంటి బాధ్యతలు, అలాగే బాబు బాధ్యతలు చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు సాయంత్రం భార్య బాబుతో కూర్చుని బాబుని ఆడిస్తూ ఉంటుంది. అప్పుడు భర్త వస్తాడు.
ఆఫీస్ నుంచి వచ్చిన భర్త, భార్య, బాబు దగ్గర కూర్చుని వారిద్దరిని చూస్తూ ఉంటాడు. అయితే సడన్ గా భార్యతో చనువుగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. బాబు అక్కడే ఉండటంతో భార్య “బాబు ముందు ఏంటిది? ఆపండి” అని అంటుంది. ఆ భర్త ఆపినట్టే ఆపి మళ్ళీ భార్యతో చనువుగా ప్రవర్తించడం మొదలుపెడతాడు.
భార్య మళ్లీ బాబు ఉన్నాడు అని చెప్పి హెచ్చరిస్తుంది. ఇంక ఇలా కాదు అని భర్త తన ఫోన్, ఆ భార్య తన బాబుకి ఇస్తాడు. ఫోన్ బాబుకి ఇచ్చి ఆడుకోమని చెప్పి భార్యతో పాటు వెళ్తాడు. వారిద్దరు గదిలో ఉన్నప్పుడు ఆ బాబు ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తాడు. చూసుకోకుండా ఇంస్టాగ్రామ్ లో వీడియో రికార్డింగ్ ఆప్షన్ లోకి వెళ్తాడు. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తాడు.
దాంతో ఆ భార్యాభర్తల వీడియో మొత్తం రికార్డ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఏ చిన్న విషయం అయినా వైరల్ అవుతుంది. దాంతో ఈ వీడియో కూడా అలాగే వైరల్ అయిపోతుంది. తెలియని వాళ్లు కూడా వీరి వీడియోని చూస్తారు. అలా వీడియో సోషల్ మీడియా అంతా పాకుతుంది. ఇదంతా ఆ బాబుకి ఫోన్ ఇవ్వడం వల్ల అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చిన్న పిల్లలకి ఇలా ఫోన్ ఇవ్వడం కారణంగా, తల్లిదండ్రులు వాళ్ళకి తెలియకుండా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చిన్న పిల్లలకి ఫోన్ దూరంగా ఉంచడం మంచిది. ఇదంతా బాదంపాలు అనే షార్ట్ ఫిలింలో చూపించారు. ఆ షార్ట్ ఫిలిం కామెంట్స్ లో కూడా ఇదంతా నిజం అని, పిల్లలకి ఫోన్ ఇవ్వడం అంత మంచిది కాదు అని కామెంట్ చేస్తున్నారు.
watch video :
End of Article