ముందు అలా తర్వాత ఏమో ఇలా.! స్టాలిన్ సినిమా లో ఈ విషయం గమనించారా.?

ముందు అలా తర్వాత ఏమో ఇలా.! స్టాలిన్ సినిమా లో ఈ విషయం గమనించారా.?

by Mohana Priya

Ads

సినిమాల్లో కథ ప్రకారం ఎన్నో మార్పులు జరుగుతాయి. అందులోనూ ముఖ్యంగా డైలాగ్స్ విషయంలో అయితే చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి. అంటే ముందు ఒక లాగా చెప్పడం, తర్వాత డైలాగ్ మార్చడం అలా అన్న మాట. అయితే వల్ల ఒక సినిమాలో ఒక డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Video Advertisement

Stalin movie climax hospital scene

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా స్టాలిన్. ఈ సినిమా విడుదల అయినప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒక మనిషి మరో ముగ్గురు మనుషులకు సహాయం చేయడం, ఆ ముగ్గురు మనుషులు అని మరో ముగ్గురు మనుషులకు సహాయం చేయమని చెప్పడం అనే కాన్సెప్ట్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది.

Stalin movie climax hospital scene

అయితే ఈ సినిమాలో చిరంజీవి క్లైమాక్స్ లో హాస్పిటల్ లో చేరుతారు. క్లైమాక్స్ లో చిరంజీవికి ఆపరేషన్ జరుగుతుంది. ఆ సమయంలో చిరంజీవిని చూడడానికి, చిరంజీవి గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది జనాలు హాస్పిటల్ దగ్గరికి వస్తారు. అయితే  చిరంజీవికి ఆపరేషన్ చేయాలని, కానీ చేస్తే ఆయన ప్రాణాలకే ప్రమాదం ఉంది అని అన్నప్పుడు డాక్టర్ అయిన సుమన్ తో సునీల్ “మీరు ఎలాగైనా ఆపరేషన్ చేసి మా అన్నయ్యని కాపాడాలి డాక్టర్” అని చెప్తారు.

Stalin movie climax hospital scene

తర్వాత ఆపరేషన్ జరుగుతుంది. ఆ తర్వాత డాక్టర్ అయిన సుమన్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్తారు. అయితే చివరిలో సునీల్ మళ్లీ చిరంజీవితో తనని కాపాడింది డాక్టర్ కాదు ప్రజలు అని చెప్తారు. అయితే ముందు డాక్టర్ తో తన అన్నయ్యని కాపాడమని అడిగి, చివరిలో తనను కాపాడింది ప్రజలు అని చెప్పడంపై సోషల్ మీడియాలో సరదాగా మీమ్స్ వస్తున్నాయి.


End of Article

You may also like