Ads
సాధారణం గా ఎయిర్ పోర్ట్ లు అంటే సకల సౌకర్యాలతో ఉంటాయి. దేశ, విదేశాల నుంచి ప్రయాణించే వారు ఎక్కువ గా ఉంటారు కాబట్టి ఫెసిలిటీస్ విషయం లో ఏమాత్రం తగ్గకుండా మెయింటైన్ చేస్తారు. మరి దేశ రాజధాని అయిన ఢిల్లీ లో ఉండే ఎయిర్పోర్ట్ అంటే ఎలా ఉండాలి..? దేశ ప్రగతిని కూడా ప్రతిబింబిస్తుంది కాబట్టి మరింత సౌకర్యవంతం గా ఉండాలి.
Video Advertisement
ఈ విషయమై దర్శక ధీర రాజమౌళి ఇటీవల ఓ ట్వీట్ చేసారు. ఇటీవల ఓ పని పై ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన రాజమౌళి అక్కడ పరిస్థితి పై స్పందించారు. ఆయన అర్ధరాత్రి సమయం లో ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అక్కడ.. ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. ఇందుకోసం కొన్ని పేపర్స్ ని కూడా ఇచ్చారు. అయితే.. అక్కడ చాలా మంది ఈ పేపర్స్ ను గోడపై లేదా కింద కూర్చుని ఫిల్ చేస్తున్నారు.
దేశ రాజధాని లో ఉండే ఎయిర్ పోర్ట్ కే ఇలాంటి ఇబ్బందులు ఉండడం పై రాజమౌళి అసహనం చెందారు. టేబుల్స్ ఏర్పాటు చేయడం పెద్ద కష్టమేమి కాదన్నారు.. ‘ఇలా చూడడం ఏమి బాగోలేదని, చిన్న టేబుల్స్ ఏర్పాటు చేసినా సౌకర్యం గా ఉండేదని, బయట కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.. ఇలాంటివి చూసినప్పుడు విదేశీయులకు మనపై ఎలాంటి అభిప్రాయం కలుగుతుందో ఆలోచించాలని” ట్వీట్ చేసారు. వీటిపై దృష్టి సారించాలని ఆయన అధికారులను కోరారు. కాగా.. ఎయిర్పోర్ట్ లోని సౌకర్యాలపై దృష్టి పెట్టాలంటూ రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ అయింది. రాజమౌళి ట్వీట్ కు ఢిల్లీ ఎయిర్పోర్ట్ వారు తమ స్పందన ను కూడా తెలియచేసారు.
Dear @DelhiAirport,
arrived at 1 AM by lufthanasa flight. Forms were given to fill for the RT PcR test. All the passenges are sitting on the floors or propping against the walls to fill the forms. Not a pretty sight. Providing tables is a simple service.— rajamouli ss (@ssrajamouli) July 2, 2021
End of Article