Ads
చాలా మంది జంటలు పెళ్లయిన తర్వాత, వారికి అభిప్రాయభేదాలు వచ్చి విడిపోవడం అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ విషయంపై వారు అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అయితే సినీ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది ప్రముఖులు ఇలా పెళ్లయిన తర్వాత విడాకులు తీసుకున్నారు. వారిలో కొంత మంది నష్టపరిహారం కిందట కొంత మొత్తాన్ని చెల్లించారు. ఆ జంటలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 సంజయ్ దత్ – రియా పిళ్ళై
వీరిద్దరూ విభేదాల కారణంగా విడిపోయారు. విడిపోతున్నప్పుడు సంజయ్ దత్ రియాకి ఒక సీ ఫేసింగ్ అపార్ట్మెంట్, ఖరీదైన కార్ భరణంగా ఇచ్చారు అనే వార్తలు వచ్చాయి.
#2 ఆదిత్య చోప్రా – పాయల్ ఖన్నా
యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా తన భార్యతో విడిపోయినప్పుడు కొన్ని కోట్ల మొత్తాన్ని ఇచ్చారు అనే వార్తలు వచ్చాయి.
#3 కరిష్మా కపూర్ – సంజయ్ కపూర్
వీరిద్దరూ విడిపోయేటప్పుడు సంజయ్ కపూర్, 14 కోట్ల విలువైన బాండ్లను పిల్లల పేరు మీద కొనుగోలు చేశారట. వాటిపై నెలకు 10 లక్షల దాకా వడ్డీ వస్తుంది అనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అంతే కాకుండా ముంబైలోని ఖర్ ఏరియాలో ఉన్న తన ఖరీదైన ఇంటిని కూడా కరిష్మా కపూర్ కి నష్టపరిహారంగా ఇచ్చారట.
#4 సైఫ్ అలీఖాన్ – అమృతా సింగ్
దాదాపు 13 సంవత్సరాల తర్వాత వీరిద్దరూ విడిపోయారు. అయితే విడిపోయినప్పుడు సైఫ్ అలీఖాన్ అమృతా సింగ్ కి భరణంగా తన ఆస్తిలో సగభాగాన్ని ఇచ్చారట.
#5 హృతిక్ రోషన్ – సుజేన్ ఖాన్
వీరిద్దరూ విడిపోయినప్పుడు సుజేన్ కి హృతిక్ రోషన్ 380 కోట్ల రూపాయలను భరణంగా ఇచ్చినట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది.
#6 అమీర్ ఖాన్ – రీనా దత్తా
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, రీనా దత్తా వ్యక్తిగత విభేదాల కారణంగా విడిపోయారు. అయితే అమీర్ ఖాన్ కూడా కోట్ల మొత్తాన్ని రీనా దత్తాకి ఇచ్చారు అనే వార్తలు వచ్చాయి.
#7 ప్రభుదేవా – రమలత్
వీరిద్దరి మధ్య విభేదం గురించి అప్పుడు చర్చ జరిగింది. అయితే విడిపోయేటప్పుడు నష్టపరిహారంలో భాగంగా 10 లక్షల రూపాయల నగదుతో పాటు రెండు ఖరీదైన కార్లు, అలాగే 20 – 25 కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రభుదేవా రమలత్ పేరున రాసి ఇచ్చారు అనే వార్తలు వచ్చాయి.
End of Article