పెళ్లి రద్దు చేసుకుంటున్నాం అంటూ షాకింగ్ న్యూస్ చెప్పిన మెహరీన్… ఎందుకంటే..?

పెళ్లి రద్దు చేసుకుంటున్నాం అంటూ షాకింగ్ న్యూస్ చెప్పిన మెహరీన్… ఎందుకంటే..?

by Anudeep

Ads

“కృష్ణ గాడి వీర ప్రేమ గాథ” సినిమా తో తెలుగు వారికి పరిచయమైన భామ మెహరీన్. తక్కువ సమయం లోనే మెహరీన్ మంచి నటి గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె అందం, అభినయం తెలుగు వారిని బాగా ఆకట్టుకున్నాయి. ఆ తరువాత ఎఫ్ 2 సినిమా కూడా మంచి హిట్ గా నిలిచింది. దాదాపు ఆమె పోషించిన పాత్రలన్నీ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Video Advertisement

mehareen 1

ఇటీవల మెహరీన్ పెళ్లి కూడా నిశ్చయమైన సంగతి తెలిసిందే. కెరీర్ టాప్ లో ఉండ గానే మెహరీన్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. పెద్దలు నిర్ణయించిన వ్యక్తి భవ్య బిష్ణోయ్ తో మెహరీన్ నిశ్చితార్ధం కూడా జరిగింది. ఈ ఏడాది మార్చి లోనే ఈ వేడుక జరిగింది. కరోనా కారణం గా వీరి పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. మరి కొన్ని రోజుల్లో.. పెళ్లి తేదీని కూడా ఖరారు చేస్తారని అందరు అనుకుంటున్న తరుణం లో మెహరీన్ షాకింగ్ న్యూస్ చెప్పింది.

mehareen 3

తమ వివాహం రద్దు కాబోతున్నట్లు మెహరీన్ ప్రకటించింది. “నేను, భవ్య బిష్ణోయ్ వివాహం చేసుకోవాలని అనుకోవడం లేదు. ఇద్దరం స్నేహపూర్వకం గానే, పూర్తి మద్దతు తో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇక పై భవ్య బిష్ణోయ్ తో గాని, అతని కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కానీ ఎటువంటి రిలేషన్ ఉండదని తెలుపుతున్నాను. ఇంత వరకు మాత్రమే చెప్పగలను, నా ప్రైవసీ కి కూడా రెస్పెక్ట్ ఇస్తారని, అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నాను” అంటూ మెహరీన్ చెప్పుకొచ్చారు. ఇకపై సినిమాలపై, తదుపరి ప్రాజెక్ట్స్ పై దృష్టి పెడతానని ఆమె పేర్కొన్నారు.


End of Article

You may also like