Ads
ఒక సంవత్సరంలో మన ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు అనౌన్స్ చేస్తారు. అయితే, అలా అనౌన్స్ చేసిన సినిమాలు అన్నీ టైంకి పూర్తి అవ్వాలని రూలేమి లేదు. అలా మొదలు పెట్టిన ఎన్నో సినిమాలు తర్వాత ఆగిపోయాయి. వాటిలో పెద్ద హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. అందుకు కారణం ఏదైనా అవ్వొచ్చు. అలా మొదలయ్యి ఆగిపోయిన సినిమాల్లో ఒకటి చిరంజీవి హీరోగా నటించిన అబు.
Video Advertisement
ఇది హాలీవుడ్ సినిమా. ఈ సినిమాకి ఇంగ్లీషులో ద రిటర్న్ ఆఫ్ ది థీఫ్ ఆఫ్ బాగ్దాద్ అని పేరు పెట్టారు. తెలుగులో అయితే అబూ బాగ్దాద్ గజదొంగ అనే పేరు పెట్టారు. ఈ సినిమా 1999 లో మొదలయ్యింది. ఈ సినిమా నిర్మాతలు నీల్ ఆడమ్స్, రమేష్ కే సుందర్ స్వామి. దర్శకులు ఇంగ్లీష్ వర్షన్ కి డోచెన్ గెర్సీ, తెలుగు వెర్షన్ కి సురేష్ కృష్ణ గారు.
ఈ సినిమాలో మనిషా కొయిరాలా హీరోయిన్ గా నటించగా, రెహమాన్ సంగీతం అందించారు. సినిమా ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. అందుకు రెండు రకాల కారణాలు వినిపిస్తున్నాయి. మొదటిది ఏంటంటే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో ఖురాన్ ని అభ్యంతరకరంగా చూపించారట. ఒక సన్నివేశంలో ఖురాన్ ని పురాతనంగా చూపించడానికి బురదలో నుంచి తీస్తారట.
దాని వల్ల సినిమా వివాదాల్లో ఇరుక్కుంది. సౌదీ అరేబియాలో కేస్ అయ్యింది. ఇంకొకటి ఏంటంటే మన పురాణాల ప్రకారం సూర్య దేవుడు ఐదు గుర్రాల మీద స్వారీ చేస్తారు. ఈ సినిమాలో అందుకు విరుద్ధంగా ఉందట. ఇంకొక కారణం ఏంటంటే సినిమాకి బడ్జెట్ సరిపోకపోవడంతో ఆపేశారు అనే ఒక వార్త ప్రచారంలో ఉంది. మరి ఈ కారణాల్లో ఏది నిజమో ఆ సినిమా బృందానికి మాత్రమే తెలియాలి. ఈ సినిమా విడుదలయ్యి ఉంటే చిరంజీవి ఆ టైంలోనే పాన్ ఇండియా స్టార్ అయిపోయేవారు కదా.
End of Article