పానీపూరి ఎంత ఇష్టమైతే మాత్రం.. పెళ్ళిలో ఇలా కిరీటం లా పెట్టుకుంటారా..? ఈ ఫన్నీ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

పానీపూరి ఎంత ఇష్టమైతే మాత్రం.. పెళ్ళిలో ఇలా కిరీటం లా పెట్టుకుంటారా..? ఈ ఫన్నీ వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

by Anudeep

Ads

పానీపూరి ఇష్టపడని వారెవరు ఉంటారు. కాలేజీ లేదా ఆఫీస్ పూర్తి అయిపోయాక బయటకు వస్తూ దగ్గరలోనే వేడి వేడి గా పొగలు వస్తున్న బండి దగ్గరకు వెళ్లి “అన్నా పానీ పూరి” అని చెప్పి.. మధ్య మధ్య లో “తోడా ప్యాజ్ దాలో” అంటూ అడుగుతూ.. ఒక్కొక్కటి తింటూ ఉంటె.. ఆ ఫీలింగే వేరు కదా.. ఈ కరోనా కారణం గా అలంటి మెమరబుల్ మూమెంట్స్ ని మిస్ అవుతూ ఉన్నాం. అయితే.. ఓ కొత్త పెళ్లి కూతురు మాత్రం పానీపూరీనే కిరీటం లా చేసుకుని తన పెళ్లి వేడుకలో ధరించింది.

Video Advertisement

panipuri crown

మన ఫ్రెండ్స్ లో కూడా.. చాలామంది పానీ పూరి అంటే పిచ్చి ఉన్న వారు వుండే ఉంటారు. కానీ.. మరీ పెళ్లి వేడుకలో కూడా వాటిని కిరీటం లా చేసుకుని వేసుకునే వారు ఎవరు ఉండరు అనుకుంట. అందుకే.. ఈ వీడియో అంతగా వైరల్ అయింది. ఈ కొత్త పెళ్లి కూతురు పానీ పూరి పై తనకున్న అభిమానాన్ని ప్రత్యేకం గా చూపించింది. తనకు ఎంతో ప్రత్యేకమైన పెళ్లి రోజున పానీ పూరి కిరీటాన్ని పెట్టుకుంది. పానీ పూరి తో చేసిన దండను కూడా వేసుకుంది.

panipuri crown 2

ఆమె మేక్ అప్ ఆర్టిస్ట్ ఈ వీడియో ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఈ వీడియో ను పోస్ట్ చేస్తూ.. ఆమె “నా అందమైన వధువు అక్షయ మరియు నా వరుడు అభిషేక్ కు చాలా అభినందనలు.” అంటూ పేర్కొన్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయం లో ఈ వీడియో ను తీసినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ వీడియో కు 4.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో ను మీరు కూడా చూడవచ్చు.

 


End of Article

You may also like