Ads
మూవీ క్రిటిక్, బిగ్ బాస్ ఫేమ్ కత్తి ఇక లేరు. ఇటీవల చెన్నై రోడ్డు మార్గం లో జరిగిన ప్రమాదం లో మహేష్ కత్తి తీవ్రం గా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన వెంటనే అపోలో ఆసుపత్రి లో చేరారు. గత కొన్ని రోజులు గా అపోలో ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ వచ్చారు..
Video Advertisement
మరో వైపు వైద్యులు ఆయనకు అన్నిరకాల వైద్య సేవలను అందిస్తూ వచ్చారు. ఆయన ప్రాణాలను నిలపడానికి శాయశక్తులా కృషిచేశారు. అయితే పరిస్థితి చేయిదాటిపోయింది. మహేష్ కత్తి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లా గూడూరు సమీపం లో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కార్ కి ఆక్సిడెంట్ అయింది. ఆ సమయం లో మహేష్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం తో ఆయన కళ్ళు, తలా, ముక్కుకు తీవ్రం గా గాయాలయ్యాయి. వెంటనే ఆయనను నెల్లూరు ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి తీవ్రం గా ఉండడం తో అక్కడనుంచి చెన్నై అపోలో కు తరలించారు.
వైద్యుల ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. అయితే.. ఆయనకు రెండు బలమైన కోరికలు ఉన్నాయట. అవి తీరకుండానే ఆయన ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. మొదటి కోరిక ఏంటంటే.. ఆయన రాజకీయాల్లో రాణించడం. మరొక కోరిక ఏంటంటే.. సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి పేరు గల నటుడి గా రాణించాలని ఆయన కోరుకున్నారట.
ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు 2018 లోనే ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలలో నటించినప్పటికీ.. ఆయన పూర్తి స్థాయి నటుడి గా నిలదొక్కుకోలేదు. ఇంతలోనే ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో చదువుకునే రోజులలోనే ఆయన రాజకీయాలపై ఆసక్తిని కలిగి ఉండేవారు. రాజకీయాల్లోకి వచ్చాక కత్తి మహేష్ వైసీపీ కి మద్దతు ఇస్తూ వచ్చారు. ఆయనకు టికెట్ వస్తుందని కూడా అందరు అనుకున్నారు. అయితే.. కత్తి మహేష్ ఆర్ధికం గా అంత బలపడకపోవడం తో.. మరోవ్యక్తి టికెట్ ఇచ్చారు. అలా రాజకీయాల్లో ఒక స్థానం సంపాదించుకోవాలన్న కోరిక తీరకుండానే కత్తి మహేష్ వెళ్లిపోయారు.
End of Article