Ads
మూవీ క్రిటిక్, బిగ్ బాస్ ఫేమ్ కత్తి ఇక లేరు. ఇటీవల చెన్నై రోడ్డు మార్గం లో జరిగిన ప్రమాదం లో మహేష్ కత్తి తీవ్రం గా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఆయన వెంటనే అపోలో ఆసుపత్రి లో చేరారు. గత కొన్ని రోజులు గా అపోలో ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ వచ్చారు.. నెల్లూరు జిల్లా గూడూరు సమీపం లో కత్తి మహేష్ ప్రయాణిస్తున్న కార్ కి ఆక్సిడెంట్ అయింది.
Video Advertisement
ఆ సమయం లో మహేష్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం తో ఆయన కళ్ళు, తలా, ముక్కుకు తీవ్రం గా గాయాలయ్యాయి. వెంటనే ఆయనను నెల్లూరు ఆసుపత్రి కి తరలించారు. పరిస్థితి తీవ్రం గా ఉండడం తో అక్కడనుంచి చెన్నై అపోలో కు తరలించారు. నిన్న మొన్నటి వరకు ఆయన పరిస్థితి బాగానే ఉందని.. వైద్యానికి స్పందిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆయన సన్నిహితులు సైతం ఇదే విషయాన్నీ చెబుతూ వచ్చారు.
ఆయన స్నేహితుడు వెంకట సిద్ధారెడ్డి కూడా ఇదే చెప్పారు. వైద్యానికి స్పందిస్తున్నారని, త్వరలోనే మాములు మనిషై తిరిగొస్తారని చెబుతూ వచ్చారు. ఇప్పటి దాక చేసిన సర్జరీలు సక్సెస్ అయ్యాయని వైద్యులు సైతం చెబుతూ వచ్చారు. మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ కూడా కత్తి మహేష్ వైద్యం నిమిత్తం పదిహేడు లక్షల సాయాన్ని కూడా అందించింది.
అంత బాగానే ఉంది అనుకుంటున్న తరుణం లోనే హఠాత్తుగా కత్తి మహేష్ మరణ వార్తా వినాల్సి వచ్చింది. మొన్నటి వరకు కత్తి మహేష్ పరిస్థితి విషమం గా ఉందని వార్తలు వచ్చినప్పటికి.. రెండు రోజులకు అవి కూడా ఆగిపోయాయి. వైద్యులు కూడా ప్రాణాలకు ప్రమాదమేమీ లేదని చెబుతూ వచ్చారు. అంతలోనే ఇలా జరగడం తో కత్తి మహేష్ సన్నిహితులు విషాదం లో మునిగిపోయారు.
End of Article