Ads
కాజల్ అగర్వాల్ గతేడాది తన ప్రియుడు గౌతమ్ కిచ్లు ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. పెళ్లి అయిన తరువాత కూడా కాజల్ అగర్వాల్ తన సినిమా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతము కాజల్, తన భర్త తో కలిసి ముంబై లో నివసిస్తున్న సంగతి తెలిసిందే.
Video Advertisement
వ్యక్తిగతం గా కాజల్ అగర్వాల్ ఆమె అత్తగారి వద్ద నుంచి కొత్త విషయాలను నేర్చుకుంటున్నారట. ఆమె అత్తగారు తరచూ ధ్యానం చేస్తుంటారట. రెండవ లాక్ డౌన్ సమయం లో ఆవిడ కాజల్ కు అల్లడం మరియు క్రోచింగ్ వర్క్ ను నేర్పించారట. ఈ చందమామ ప్రస్తుతం హిందీ భాషా చిత్రం ‘ఉమా’ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అలాగే ‘ఘోస్టీ’ అనే తమిళ చిత్రం లో కూడా నటించబోతున్నారు. అలాగే.. రాబోయే రోజుల్లో ఆమె మరో రెండు కోలీవుడ్ సినిమాలను కూడా చేయనున్నారట. అలాగే ప్రవీణ్ సత్తారు దర్శకత్వం లో అక్కినేని నాగార్జున ఆక్షన్ థ్రిల్లర్ లో కూడా ఆమె నటించనున్నారని సమాచారం. ఇంకా ఈ సినిమా కి టైటిల్ అనుకోలేదు.
End of Article