Ads
టాలీవుడ్ లో హీరోయిన్ల కు కొదవలేదు. అందం మాత్రమే కాదు.. టాలెంట్ కూడా ఇక్కడ అమ్మాయిల సొంతం. ఐతే.. అందం, అభినయం తో ఆకట్టుకోవడం తో రెమ్యునరేషన్ విషయం లో కూడా మనవాళ్ళు గట్టిగానే ఉంటారండోయ్. కష్టానికి తగ్గ ప్రతిఫలం తీసుకోవాలి.. అందులోను మన టాలీవుడ్ తారలు ఎంతెంత రెమ్యునరేషన్ లు తీసుకుంటున్నారో చూద్దాం.
Video Advertisement
టాలీవుడ్ స్వీటీ అనుష్క శెట్టి ఎలాంటి వివాదాలు లేకుండా అగ్ర తారగా ఉన్నారు. ఇక పూజా హెగ్డే , కాజల్ అగర్వాల్ వంటి తారలు కూడా టాప్ పొజిషన్ లోనే సాగుతున్నారు. వీరు ఇటీవలే బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. నివేదికల ప్రకారం, పూజా హెగ్డే సినిమాకు 3.5 కోట్లు సంపాదిస్తుండగా, కాజల్ అగర్వాల్ మరియు అనుష్క శెట్టి ఒక సినిమాకు 2.5 కోట్ల నుండి 3 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఒక్క సినిమా కి ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అని మనం అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యం కదా.. కానీ, టాలెంట్, డిమాండ్ ఎక్కువ ఉన్నపుడు వాళ్ళు ఇంతంత రెమ్యునరేషన్ తీసుకోవడం లో ఆశ్చర్యం ఏమి లేదు కదా..
End of Article