Ads
ఒక వ్యక్తికి తన భార్యతో జరిగిన ఒక సంఘటన గురించి ఈ విధంగా చెప్పారు. “మాకు పెళ్ళయి వారం రోజులు అయ్యింది. మొదటి రాత్రి రోజు నేను నా భార్య కోసం ఎదురు చూస్తున్నాను. కొంచెం సేపటికి తను వచ్చింది. నేను తనతో కొంచెంసేపు మామూలుగా మాట్లాడాను. ఆ తర్వాత కొంత సేపటికి తన చేతిలో ఉన్న ఒక పేపర్ నాకు ఇచ్చింది. “ఏంటిది?” అని అడిగాను. “చదవండి” అని చెప్పింది. ఆ పేపర్ తెరిచి చూస్తే అందులో కొన్ని పాయింట్స్ లాగా రాసి ఉన్నాయి.
Video Advertisement
ఆ ఉత్తరంలో “పెళ్లయిన వెంటనే వేరే కాపురం పెట్టాలి. నేను చెప్పినట్టు మీరు వినాలి. మీకు జీతం వస్తే నాకు ఇవ్వాలి. మీ వాళ్ళు నన్ను ఒక్క మాట అన్నా కూడా నేను పడను” అని రాసి ఉంది. ఇదంతా చూసి “ఏంటి ఇలా రాసావు?” అని అడిగాను. అందుకు తను “కాదండి మామూలుగా పెళ్లయిన తర్వాత అందరూ జీవితాలు కొన్ని రోజులకు ఇలానే అవుతున్నాయి కదా?” అని అంది. “ఎవరు అన్నారు అలా?” అని అడిగితే “మా అమ్మ నాన్న అన్నారు” అని చెప్పింది.
తను చాలా అమాయకురాలు అని నాకు అర్థం అయింది. “ఇలా ఏమీ అవ్వదులే” అని చెప్పాను. “లేదు అని నిజంగానే మీరు చెయ్యాలి” అని అంది. నేను “సరే” అన్నాను. తర్వాత కొన్ని నెలలు కాగానే ఇంట్లో గొడవలు అవ్వడం మొదలయ్యాయి. జీతం తన చేతికి ఇవ్వకపోతే గొడవయ్యేది. అన్నిటికీ గొడవ అవుతూ ఉండేది. ఒకరోజు ఇదంతా చూసి మా అమ్మ మా ఇద్దరిని వేరేగా ఉండమని చెప్పింది. నేను కూడా సరే అని చెప్పాను. వేరే ఇల్లు చూసుకున్నాం.
వేరే ఇంటికి మారే రోజు వచ్చింది. మా అమ్మ బాధపడుతోంది. కానీ నేను ఏం చేయలేకపోతున్నాను. అప్పుడు ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగింది. అమ్మ అందులో ఎక్కి వెళ్ళిపోయింది. నాకేం అర్థం కాలేదు. కొన్ని గంటల తర్వాత అమ్మ మళ్ళీ తిరిగి వచ్చింది. నేను అమ్మని “ఎక్కడికి వెళ్లావు అమ్మా?” అని అడుగుతున్నాను. అప్పుడు మా అమ్మ నా భార్యకి ఏదో సైగ చేసింది.
నా భార్య “మనం ఎక్కడికి వెళ్లట్లేదు. సామాన్లు తిరిగి లోపల పెట్టేయండి” అని చెప్పింది. నాకేం అర్థం అవ్వక “అసలు ఏం జరుగుతోంది?” అని అడిగాను. అప్పుడు నా భార్య “మీ అక్క ఎక్కడ ఉంటున్నారు?” అని అడిగింది. అందుకు నేను నేను మా అక్క ఎక్కడ ఉంటుందో చెప్పాను. “మీ అక్క వాళ్ళ అత్తమామలతో కలిసి ఎందుకు ఉండట్లేదు?” అని అడిగింది. “పని చాలా ఎక్కువగా ఉంది అని మేమే వేరేగా కాపురం పెట్టమని సలహా ఇచ్చాం” అని చెప్పాను.
అందుకు నా భార్య “మిమ్మల్ని వేరేగా కాపురం పెట్టమని అడిగినప్పుడు మీరు ఎంత బాధ పడ్డారో, మీ అమ్మగారు ఎంత బాధ పడ్డారో, మీ అక్కని వేరే కాపురం పెట్టమని చెప్పినప్పుడు, వారి కొడుకు వారికి దూరం అవుతున్నందుకు మీ బావ వాళ్ళ తల్లిదండ్రులు అంతే బాధ పడి ఉంటారు కదా?” అని అడిగింది. నాకు తరువాత తెలిసిన విషయం ఏంటంటే నా భార్య మా బావకి బంధువు అవుతుంది. నా భార్య అలా అన్న తర్వాత నిజమే అని అనిపించింది.
నాకు ఒక న్యాయం, మా బావకి ఒక న్యాయం అయితే తప్పు కదా అని అనిపించింది. దాంతో నేను మళ్ళీ మా అక్క బావ దగ్గరికి వెళ్లి మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను. ఇదే మాట ఇంట్లో చెప్పి బయలుదేరబోతుండగా నా భార్య నన్ను ఆపి “అవసరం లేదండి. ఇంతకుముందే అత్తయ్య వెళ్లి మాట్లాడి వచ్చారు. మీ అక్క, బావ వచ్చే వారం మళ్లీ తిరిగి పాత ఇంటికి వెళ్తున్నారు” అని చెప్పింది. ఇంత మంచి మనసు గల భార్యని పొందినందుకు నాకు చాలా ఆనందంగా అనిపించింది.”
NOTE: images used in this article are just for representative purpose. But not the actual characters.
End of Article