పదేళ్ల ప్రేమ.. శారీరకం గా కూడా అర్పించేసుకున్న అంబిక.. చివరకు ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు..అసలేమైందంటే..?

పదేళ్ల ప్రేమ.. శారీరకం గా కూడా అర్పించేసుకున్న అంబిక.. చివరకు ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు..అసలేమైందంటే..?

by Anudeep

Ads

ఇటీవల కాలం లో ప్రేమ వివాహాలు ఎక్కువ గా జరుగుతున్నాయి. దురదృష్టం ఏమిటంటే.. ప్రేమ పెళ్లి దాకా రావడమే గగనం అయితే.. పెళ్ళి చేసుకున్న జంటలు కలిసి ఉండడం కూడా కష్టం గానే మారింది. ఈ క్రమం లో.. కోలార్ కు చెందిన అరభికొత్తనూర్‌ గ్రామం లో విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన అంబిక, మహేష్ లు పదేళ్ల కాలం గా ప్రేమించుకుంటున్నారు. ఒకరిపై ఒకరికి నమ్మకం కలగడం తో పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు.

Video Advertisement

ambika

మహేష్ నే సర్వస్వము అని భావించిన అంబిక శారీరకం గా కూడా తనని తాను అర్పించేసుకుంది. ఇద్దరు ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమం లోనే శారీరకం గా కలవడానికి అంబిక అడ్డు చెప్పలేదు. కానీ.. కొంతకాలం గడిచేసరికి మహేష్ మోజు తీరిపోవడం తో ఇంట్లో పెద్దలు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పాడు. మార్చి 15 వ తేదీన నిశ్చితార్ధం కూడా చేసేసుకున్నాడు. దీనితో.. అంబిక అతనిని నిలదీసింది.

ambika 3

తనకిచ్చిన మాటేమిటని ప్రశ్నించింది. ఇన్నాళ్లు ప్రేమించి ఇలా చేయడానికి మనసెలా వచ్చింది అంటూ నిలదీసింది. అంబిక కుటుంబ సభ్యలు కూడా పోలీసులను ఆశ్రయించి మహేష్ పై కేసు నమోదు చేసారు. మార్చి 23 న మహేష్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. పోలీసులు కలగచేసుకోవడం తో మహేష్ వెనక్కి తగ్గి మే 9 న అంబికను పెళ్లి చేసుకున్నాడు. అయితే.. పెళ్లి జరిగిన తరువాత నుంచి మహేష్ కనిపించకుండా పోయాడు.

ambika 2

కేసు నుంచి తప్పించుకోవడానికే మహేష్ అంబికను పెళ్లి చేసుకున్నాడని అంబిక తండ్రి ఆరోపిస్తున్నాడు. తన కుటుంబానికి, తన కూతురుకి అన్యాయం జరిగిందని ఆ తండ్రి విలపిస్తున్నారు. పోలీసులు కూడా మహేష్ కుటుంబం ఇచ్చిన డబ్బుల వలనే ఈ కేసు పట్టించుకోవడం లేదని అంబిక ఆరోపిస్తోంది. మరోవైపు మహేష్ కుటుంబం రహస్యం గా మరో పెళ్లి చేయడానికి యోచిస్తోందని.. అదే జరిగితే తాను, తన కూతురికి ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని అంబిక తండ్రి విలపిస్తున్నారు.


End of Article

You may also like