Ads
టాలీవుడ్ లో యాంటీ-ఫాన్స్ లేని హీరోలలో వెంకటేష్ ఒకరు. విభిన్న కధాంశాలకే ప్రాముఖ్యత ఇస్తూ వెంకటేష్ దూసుకెళ్తున్నారు. కరోనా కారణం గా గతేడాది చాలా సినిమాలు విడుదల కాలేదు. వెంకటేష్ హీరో గా నటించిన నారప్ప మూవీ కూడా రిలీజ్ అవ్వకుండా ఆగిపోయింది. తమిళనాట వచ్చిన అసురన్ కు రీమేక్ గా “నారప్ప” ను తీసిన సంగతి తెలిసిందే.
Video Advertisement
ఇప్పటివరకు రెండు సార్లు రిలీజ్ చేద్దామనుకున్నా.. కరోనా కారణం గానే నారప్ప ఆగిపోయింది. దీనితో ఫాన్స్ కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమం లో నారప్పను ఓటిటి లో ఈ నెల 20 న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసేసారు. దీనితో ఫాన్స్ డిజప్పోయింట్ అయిపోతున్నారు. నారప్ప సినిమా ను థియేటర్ లో చూస్తేనే కిక్కు వస్తుంది. కానీ.. కరోనా కారణం గా ఆ అవకాశం లేదు.
దీనితో.. కరోనా పై తమ అక్కసు వెళ్లగక్కుతూ సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తున్నారు. ఇవి సరదాగా ఉండడం తో బాగా వైరల్ అవుతున్నాయి. నారప్ప సినిమా ఓటిటి లో రిలీజ్ అవడం పై వచ్చిన ఫన్నీ ట్రోల్ ను మీరు కూడా కింద వీడియో లో చూసేయండి.
Watch Video:
https://www.youtube.com/watch?v=pdC12WzF72I
End of Article