Ads
బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మండా అందరికి సుపరిచితుడే. టైటిల్ విన్నర్ గా నిలవడమే కాకుండా బిగ్ స్క్రీన్ పై కనిపించాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు కౌశల్ ఫాన్స్ కూడా ఎప్పుడు బిగ్ స్క్రీన్ పై కనిపిస్తారా? అని ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
బిగ్ బాస్ లో ఉన్న సమయం లో కౌశల్ ఆర్మీ పేరిట ఆయన ఫాన్స్ చాలానే సందడి చేసారు. ఐతే.. తాను బయటకు వచ్చేసిన తరువాత ఈ సందడి కొంత సద్దుమణిగింది. ఆ తరువాత కూడా కౌశల్ సోషల్ మీడియా మాధ్యమం లో తన అభిమానులతో టచ్ లో ఉంటూ వస్తున్నారు. తాజాగా.. తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి కౌశల్ అనౌన్స్మెంట్ చేసారు. ఈ పోస్ట్ చూసి చూడగానే నెటిజన్లు ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు.
ఎందుకంటే.. ఈ పోస్ట్ లో కౌశల్ తన అభిమానులు తనను “పీపుల్ స్టార్” గా పీల్చుకుంటున్నట్లు పేర్కొన్నాడు. కానీ నిజానికి.. ఆర్ నారాయణ మూర్తి గారిని మాత్రమే ప్రజలు పీపుల్ స్టార్ గా పిలుచుకుని గౌరవిస్తారు. దానితో ఆర్. నారాయణ మూర్తి అభిమానులు కూడా ఫైర్ అయ్యారు. కౌశల్ పోస్ట్ పై ట్రోల్ చేయడం ప్రారంభించారు. కౌశల్ మాటలను, నెటిజన్స్ చేస్తున్న ట్రోలింగ్ ను మీరు ఈ కింద పోస్ట్ లో చూడొచ్చు.
End of Article