Home Filmy Adda Sukumar : దర్శకుడు సుకుమార్ కు ఏమైంది…? “పుష్ప” షూటింగ్ ఎందుకు ఆగిపోయింది..?

Sukumar : దర్శకుడు సుకుమార్ కు ఏమైంది…? “పుష్ప” షూటింగ్ ఎందుకు ఆగిపోయింది..?

by Anudeep

Ads

కరోనా కారణం గా ఇప్పటికే పలు సార్లు “పుష్ప” షూటింగ్ కి అంతరాయం కలుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. పుష్ప షూటింగ్ కు మరో సారి బ్రేక్ పడిందని సమాచారం. దర్శకుడు సుకుమార్ అనారోగ్యం తో బాధపడుతున్నాడని వార్తా కధనాలు ప్రచారం అవుతున్నాయి. ఈ క్రమం లో దర్శకుడు సుకుమార్ కు ఏమైంది అంటూ ఫిలిం వర్గాలు ఆందోళన పడుతున్నాయి.

Video Advertisement

sukumar 1

ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని.. సీజన్ లోని మార్పుల కారణం గా సుకుమార్ జ్వరం బారిన పడ్డారని సమాచారం. దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. కథ పెద్దది అవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పుష్ప తొలి పార్ట్ ను ఈ ఏడాదే విడుదల చేయాలనీ సుకుమార్ భావించాడు. కానీ, కరోనా కారణం గా షూటింగ్ బ్రేక్ పడుతూ వస్తోంది. అనుకోని కారణాల వలన కూడా షూటింగ్ మొదలుపెట్టినా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది.

pushpa 1

ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది పుష్ప విడుదల అవడం కష్టమేమో అని భావిస్తున్నారు. తాజాగా.. సుకుమార్ అనారోగ్యానికి గురి అవడం తో ఈ సినిమా షూటింగ్ కి మళ్ళీ బ్రేకులు పడ్డాయి. అయితే.. మెడికల్ ట్రీట్ మెంట్ కు సాధ్యమైనంత దూరం గా ఉండే సుక్కు ఇప్పుడు కూడా హోమియోపతి మందులనే వాడుతున్నారట. జ్వరం తగ్గాక తొందరలోనే ఆయన షూటింగ్ ని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.


End of Article

You may also like