Ads
స్వయం కృషి తోనే చిరంజీవి మెగాస్టార్ గా రాణించారు. అయితే.. ఆయన కొత్త గా వచ్చే నటులకు.. తనకింద పని చేసేవారిపట్ల కూడా ఎంతో సహృదయం గా మెలుగుతూ ఉంటారు. నేటితరం నటీనటులకు ఆయన ఆదర్శం గా నిలుస్తున్నారు. ఇటీవల కరోనా కాలం లో కూడా చిరంజీవి ముందుకొచ్చి తోచినంత సాయం చేసిన సంగతి తెలిసిందే.
Video Advertisement
తాజాగా లంకేశ్వరుడు సినిమా కు కో డైరెక్టర్ గా పని చేసిన ప్రభాకర్ చిరు చేసిన సాయాన్ని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి తనకు సాయం చేయకపోయి ఉండుంటే.. తన పిల్లల చదువులు పూర్తి అయ్యేవి కాదన్నారు. తాను డైరెక్టర్ గా “హెల్ప్ లైన్” అనే సినిమా తీశానని.. కానీ ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదన్నారు. ఈ సినిమా కు దర్శక, నిర్మాత బాధ్యతలు తీసుకుని నష్టపోయానని.. పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బందిపడ్డానన్నారు. ఈ విషయాన్నీ చిరు ముందుకు తీసుకువెళ్తే.. ఆయన వెంటనే స్పందించి ఫీజు ఏర్పాటు చేశానన్నారు. అప్పటిదాకా.. కాలేజీ ఫీజు ఇన్ టైం లో కట్టని కారణం గా ఎగ్జామ్ రాయనివ్వని యాజమాన్యం.. చిరంజీవి సాయం చేసారని చెప్పగానే.. సహకరించారన్నారు. రామ్ చరణ్ సహా స్టాఫ్ అంతా తనకు సాయం చేశారన్నారు.
End of Article