Ads
రెండు తెలుగు రాష్ట్రాలలోను పవన్ కళ్యాణ్ కు ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. కేవలం అభిమానుల్లోనే కాదు.. టాలీవుడ్ ఇండస్ట్రీ లో పవన్ ను అభిమానించే వారు ఉన్నారు. ఈ క్రమం లో ఫామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ తో పాపులారిటీ సంపాదించుకున్న రవీంద్ర విజయ్ కూడా పవన్ కళ్యాణ్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు.
Video Advertisement

ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ, ఉమా మహేశ్వరస్య ఉగ్ర రూపస్య.. వంటి సినిమాల్లో రవీంద్ర నెగటివ్ రోల్ ను పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా.. పవన్ కళ్యాణ్ నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాలో రవీంద్ర కు అవకాశం దక్కింది. ఈ సందర్భం గా పవన్ ను దగ్గరగా చుసిన రవీంద్ర పవన్ చాల ప్రొఫెషనల్ అని పేర్కొన్నారు. పొరపాటున కూడా ఎవరిని బాధ పెట్టరు అని పేర్కొన్నారు. టైం మైంటైన్ చేయడం.. వయసు తో సంబంధం లేకుండా అందరిని ఒకేలా ట్రీట్ చేస్తారని చెప్పారు.
End of Article
