Ads
ప్రేమ అన్న తర్వాత ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. చాలా మంది ఈ ప్రేమ విషయంలో చేసే పొరపాటు ఏంటంటే, అవతలి వారు తమని నిజంగానే ప్రేమిస్తున్నారా? లేదా వారి ప్రేమ అబద్దమా? అని తెలుసుకోలేకపోతారు. మీ పార్ట్నర్ ప్రేమ నిజమా? కాదా? తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు కింద చెప్పబోయేవి చదవండి. దాన్నిబట్టి మీకే అర్థం అయిపోతుంది.
Video Advertisement
# మీ పార్ట్నర్ అందరి ముందు మీరంటే చాలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు. బయట వాళ్ళ అందరి ముందు మీతో చాలా క్లోజ్ గా ఉంటారు. కానీ ఇంట్లో మాత్రం ఏదో అంటీ ముట్టనట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అవసరమైతే తప్ప మీతో ఎక్కువగా మాట్లాడరు. ఇలా ఉంటే వారి ప్రేమ నిజం కాదు అని అర్థం.
# మీ మధ్య ఓపెన్ టాక్ చాలా తక్కువగా ఉంటుంది. మీరు మాట్లాడితే తప్ప అవతలి వారు మాట్లాడరు. మీరు ఏదైనా చెప్తున్నా కూడా ఏదో ఆసక్తి లేకుండా వింటూ ఉంటారు. ఆ టాపిక్ గురించి మీరు మాట్లాడడమే తప్ప అవతలి వారి నుండి ఎటువంటి స్పందన ఉండదు. అలాంటప్పుడు వారికి మీపై కానీ, మీరు చెప్పే మాటలపై కానీ ఆసక్తి లేదు అనే విషయాన్ని గమనించాలి.
# మీ అలవాట్లను మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ పార్ట్నర్ రాకముందు మీకు కొన్ని అలవాట్లు ఉంటాయి. అందులో చెడు అలవాట్లు ఏమైనా ఉంటే, వాటిని మార్చడానికి ప్రయత్నిస్తే పర్వాలేదు. కానీ మీపై అధికారం ఎక్కువగా తీసుకుని, మీ సాధారణ అలవాట్లు కూడా మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
అలాంటి దుస్తులు వేసుకోవద్దు, అలాంటి చోటికి వెళ్ళద్దు, వారితో మాట్లాడొద్దు, నేను చెప్పింది చెయ్యి అని అధికారం చూపిస్తూ ఉంటారు. వీటిలో ఏ ఒక్కటి మీరు గమనించినా కూడా మీ రిలేషన్ షిప్ గురించి మీరు మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
# ఏదైనా గొడవ అయినప్పుడు వదిలేసి వెళ్లిపోతారు. మీతో కలిసి కూర్చొని ఆ గొడవకి పరిష్కారం ఆలోచించడానికి అస్సలు ప్రయత్నించరు. మీరు ఎలాంటి బాధలో అయినా ఉండనీయండి, వారికి మాత్రం ఆ విషయం అస్సలు పట్టదు. దాంతో వారికి మీ ఫీలింగ్స్ గురించి పెద్దగా పట్టదు అని, మీరు బాధలో ఉన్నారా? లేకపోతే మీకు ఏదైనా సహాయం అవసరమా? అనే విషయాలు వారు పెద్దగా పట్టించుకోరు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి.
# ఏ బంధంలో అయినా కూడా ప్రయారిటీ అనేది చాలా ముఖ్యం. ఎవరైనా అవతల వ్యక్తికి ఇచ్చే ప్రయారిటి ని బట్టి, వారికి మీరు అంటే ఎంత ఇష్టమో అనేది చెప్పొచ్చు. మీ మెసేజెస్ చూసి జవాబు ఇవ్వకపోవడం, వారు ముఖ్యమైన పనిలో లేకపోయినా కూడా మీ కాల్స్ ఆన్సర్ చేయకపోవడం లాంటివి తరచుగా జరుగుతూ ఉంటే వారికి ఖచ్చితంగా మీరు ప్రయారిటీ లో లేరు.
# వారు వారి మాజీ పార్ట్నర్ గురించి ఎక్కువగా ప్రస్తావిస్తూ వుంటారు. మీకంటే వాళ్లు బెటర్ అనే భావనని తీసుకొస్తుంటారు. అప్పుడప్పుడు వారిని మిస్ అవుతున్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. దాంతో మీ పార్ట్నర్ మనసులో వారి మాజీ పార్ట్నర్ ఇంకా ఉన్నారు అనే విషయాన్ని మీరు గమనించాలి.
# వారు ఎక్కువగా కేవలం వారి భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించుకుంటూ ఉంటారు. మీరు ఒకరు ఉన్నారు అనే విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోరు. వారి ఫ్యూచర్ ప్లాన్ కేవలం వారి ఒక్కరి గురించి మాత్రమే ఉంటుంది.
# సోషల్ మీడియా అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది. కానీ చాలా మందికి ప్రమాదంగా కూడా తయారవుతుంది. మీ పార్టనర్ మీతో చాలా క్లోజ్ గా ఉన్నట్టు పిక్చర్స్ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. కానీ నిజ జీవితంలో మాత్రం సోషల్ మీడియాలో ఉన్న అంత ప్రేమ కనిపించదు.
ఈ పైన చెప్పినవన్నీ ఒకసారి గమనించండి. మీ పార్ట్నర్ నిజంగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని మీరే తెలుసుకోండి.
Note: all the images used in this article are just for representative purpose. But not the actual characters
End of Article