Ads
ప్రేమను పంచి.. ఆప్యాయం గా చూసుకునే భర్తలు అందరికి దొరకరు. దొరికిన వారిలో కొందరు వారిలోని ప్రేమను గుర్తించలేకపోవడం దురదృష్టకరం. ఇటీవల.. ఓ మహిళ తనను ఎంతో ప్రేమ గా చూసుకుంటున్న భర్తను కాదనుకుని ప్రియుడి వద్దకు వెళ్ళిపోయింది. చివరకు విగతజీవి గా మారింది. ఆమె మరణం గురించి తెలియడం తో ఆమె భర్త కన్నీరుమున్నీరవుతుంటే.. స్థానికులు సైతం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
Video Advertisement
వివరాల్లోకి వెళితే.. కడప మాసాపేట్ కు చెందిన యశోద కు వివాహమైంది. ఆమెకు భర్త జయశంకర్ తో పాటు పిల్లలు కూడా ఉన్నారు. అయితే.. ఆమె పూజయ్య అలియాస్ సురేష్ అనే వ్యక్తితో సహజీవనం చేయడం మొదలుపెట్టింది. ఆ విషయం తెలిసినా.. ఆమె భర్త ఆమెను క్షమించి ఇవన్నీ మానుకోమ్మని.. పిల్లలతో సుఖం గా ఉందామని చెప్పినా వినలేదు.
కొంతకాలానికి ప్రియుడితో కలిసి చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో దేవుని కడప వద్దకు మకాం మార్చింది. ప్రియుడి వద్దకు వెళ్ళాక తనను పెళ్లి చేసుకోవాలంటూ.. ఆమె అతనిని కోరడం మొదలుపెట్టింది. సదరు ప్రియుడేమో ఆమెను పెళ్లి చేసుకోకుండా అవసరాలకు వాడుకుంటూ ఉండేవాడు. దీనితో వీరిద్దరి మధ్య గొడవలు వచ్చాయి. ఓ సారి ఆగ్రహం లో సురేష్ యశోద కు ఊపిరి ఆడకుండా దిండు అడ్డు పెట్టి హత్య చేసాడు.
దాదాపు నాలుగేళ్లు వీరు పెళ్లి చేసుకోకుండా కాలం గడిపారు. పెళ్లి చేసుకోవాలంటూ యశోద పట్టు పట్టేసరికి సురేష్ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను అక్కడే వదిలేసి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయాడు. యశోద చెల్లెలు గోవిందమ్మ అక్కడకు వచ్చి చూసేసరికి ఆమె శవమై ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన భార్య చనిపోయిందని తెలియడం తో.. భర్త జయశంకర్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఎక్కడో అక్కడ తన భార్య సంతోషం గా ఉందనుకున్నానని.. ఇలా అవుతుందని ఊహించలేదని అంటూ బాధపడ్డాడు.
End of Article