Ads
రామ్ గోపాల్ వర్మ సంచలనాలకు మారు పేరు ఆయన సినిమా తీసినా, ఒక ఇంటర్వ్యూ ఇచ్చినా, ఒక ట్వీట్ వేసినా, సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆ మేటర్ గురించే మాట్లాడుకుంటారు. ఆ మధ్య పవన్ ఫాన్స్ తో ట్విట్టర్ వార్ చేసిన వర్మ. ఈ మధ్య లాక్ డౌన్ లో పలు సినిమా లు కూడా తీశారు, అవి పెద్దగా జనాలకి ఎక్కలేదనుకోండి అది వేరే విషయం. ఎన్ని సినిమాలు సక్సెస్ కాకపోయినా ఇంకా సినీ అభిమానులు ఆర్జీవీ సినిమా కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. అది ఆయన ఫాలోయింగ్.
Video Advertisement
ఈ మధ్య తన సినిమాల్లో నటించే హీరోయిన్లను పోగొడుతూ.. వాళ్ళ అందాలను వర్ణిస్తూ.. వారితో కలిసి డాన్స్ లను కూడా చేస్తూ వీడియోలు రికార్డు చేసి సోషల్ మీడియా లో వదులుతున్నారు. ఇప్పటికే పలు వీడియో లు వైరల్ అయ్యాయి కూడా. తాజాగా.. మరో వీడియో కూడా సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. తాను తీయబోయే సినిమాలో నటిస్తున్న హీరోయిన్ ఇనయా సుల్తానాతో కూడా ఓ పార్టీ లో డాన్స్ వేశారు. ఏకం గా ఆమె కాళ్ళమీద పడిపోయారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
I officially share this video of mine and @RGVzoomin pic.twitter.com/gr80fFARnK
— Inaya Sultana (@inaya_sultana) August 25, 2021
End of Article