కుటుంబ భారాన్ని మోస్తున్న ఎనిమిదేళ్ల చిన్నారి…బాలుడు కధ తెలిస్తే కన్నీరు పెట్టుకుంటారు.

కుటుంబ భారాన్ని మోస్తున్న ఎనిమిదేళ్ల చిన్నారి…బాలుడు కధ తెలిస్తే కన్నీరు పెట్టుకుంటారు.

by Anudeep

Ads

ఎనిమిదేళ్ల చిన్నారి అనగానే ఆడుతూ పాడుతూ తోటి చిన్నారులతో కలిసి బడికి వెళ్తూ ఎంతో సంతోషంగా ఉండే బాల్య దశ అది ప్రపంచం అంటే ఇంకా ఏంటో కూడా సరిగ్గా తెలియని ఆ వయస్సులోనే కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తే ? అలాంటి పరిస్థితే చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలోని ఒక చిన్నారికి ఎదురైంది. చిత్తూరు జిల్లాలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి బ్యాటరీ ఆటో ని నడుపుతున్న ఈ చిన్నారి ని చూసి ఆశ్చర్యానికి గురై పని ఆపి ఈ వయస్సులోనే ఆటో ఎందువల్ల నడపాల్సి వస్తుంది అని ప్రశ్నించగా అసలు విషయం తెలిసింది. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలోని గంగుడు పల్లి గ్రామానికి చెందిన పాపిరెడ్డి మరియు రేవతమ్మ దంపతుల కుమారుడు ఈ చిన్నారి.

Video Advertisement

ఈ దంపతులకి మొత్తం ముగ్గురు కుమారులు వారిలో పెద్దవాడు ఈ చిన్నారి గోపాల్ రెడ్డి. తల్లిదండ్రులిద్దరూ అంధులు కావడంచేత కుటుంబన్ని పోషించడానికి వేరే మార్గంలేక ముగ్గురు కుమారూలలో పెద్దవాడు ఆయన కారణంచేత ఈ చిన్నారి బ్యాటరీ ఆటోని నడుపుతూ ఊరిలోనే పప్పులు ధాన్యాలు మొదలగు ఉన్నవాటిని అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అని తెలిసింది.ఎంతో గొప్ప చదువులు చదివి పనిచేయగలిగే శక్తి, సామర్థ్యం ఉన్నా యువకుల్లో కూడా కొంతమంది ఇప్పటికీ తల్లిదండ్రి పైనే ఆధారపడి జీవితం లారీ అలాంటిది ఎనిమిది సంవత్సరాల వయసులోనే ఈ చిన్నారి తన బాల్యన్ని పక్కనబెట్టి కుటుంబాన్ని పోషించే భారాన్ని తన భుజాలపై మోయడం అభినందించదగ్గ విషయమే అయినప్పటికీ, ఆటోలో సరిగ్గా కూర్చుంటే కాళ్ళు కూడా అందని, తెలిసీ తెలియని వయస్సులోనే ఆటోని నడపడం అనేది ప్రమాదకరమైన విషయం.ప్రభుత్వాలు దీనిపై స్పందించి ఈ కుటుంబానికి వేరే జీవనోపాధిని కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది


End of Article

You may also like