డంపింగ్ యార్డ్ పై క్యాట్ వాక్ చేసిన మోడల్.. హ్యాట్సాఫ్ సిస్టర్..!

డంపింగ్ యార్డ్ పై క్యాట్ వాక్ చేసిన మోడల్.. హ్యాట్సాఫ్ సిస్టర్..!

by Anudeep

Ads

డంపింగ్ యార్డ్ పై క్యాట్ వాక్ చేయడం ఏంటా అనుకుంటున్నారా..? దీని గురించి తెలియాలంటే ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ ప్రాంజల్ గురించి తెలియాలి. దేశం లో డంపింగ్ యార్డ్ లు పేరుకుపోతున్న సంగతి తెలిసిందే. రోడ్డు మీద చెత్త పడేస్తే ఫైన్ వేస్తారు.. కానీ..వాటిని శుభ్రం చేయాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ లు వీటికి పలు చోట్ల పెద్ద కొండ అంత ఎత్తులో పడేసిన ఎవరూ పట్టించుకోరు.

Video Advertisement

model surabhi

ఈ డంపింగ్ యార్డ్ లను ప్రాంజల్ ఫోటో లు తీసి పోస్ట్ చేసారు. వీటిపై తక్షణమే స్పందించి చెత్తను ఖాళీ చేయాలనీ కోరాడు. కానీ ఎటువంటి స్పందన రాకపోవడం తో ప్రాంజల్ కు ఓ కొత్త ఐడియా వచ్చింది. చెత్త కుప్ప పై క్యాట్ వాక్ చేస్తున్న ఫొటోస్ తీయాలనుకున్నాడు. అందుకోసం పన్నెండవ తరగతి చదువుతూ..మోడలింగ్ ను హాబీ గా చేసుకున్న విద్యార్థిని సురభి సింగ్ సాయం తీసుకున్నాడు. ఆమె ను డంపింగ్ యార్డ్ పై క్యాట్ వాక్ చేయించి ఫోటో లు తీసుకున్నారు. డంపింగ్ యార్డ్ పరిస్థితి డేంజరస్ గా ఉంది అని చెప్పడానికి ఆ మోడల్ తో రెడ్ కలర్ డ్రెస్ వేయించి ఈ ఫోటోలు తీశారు. దీనితో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫోటోలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.


End of Article

You may also like