ఇటీవల విడుదల అయిన లవ్ స్టోరీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుందన్న సంగతి విదితమే. అందులో సాయి పల్లవి గురించి ప్రత్యేకం గా చెప్పుకోవాల్సిందే. ఆమె సహజమైన నటన, సహజమైన భాష, ఇక డాన్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు…ఇరగదీసేసింది. ఏదైనా మంచి సినిమా వచ్చింది అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కచ్చితం గా టీం ని మెచ్చుకుంటూ ఓ ట్వీట్ వేస్తారు.

లవ్ స్టోరీ గురించి కూడా మహేష్ బాబు ట్వీట్ వేశారు. సాయి పల్లవి ని ఉద్దేశించి మాట్లాడుతూ.. అసలు ఆమె శరీరం లో ఎముకలు ఉన్నాయా..? ఆమెలా డాన్స్ వేసే వారిని ఎవ్వరినీ చూడలేదు అంటూ ప్రశంసించారు. ఇక చైతన్య కూడా అద్భుతమైన నటన కనబరిచాడని, ఈ సినిమా కచ్చితం గా తన కెరీర్ ను మలుపు తిప్పే సినిమా అవుతుందని కితాబిచ్చారు.
@Sai_Pallavi92 sensational as always… does the lady have any bones??? Haven't seen anyone dance like this ever on screen!!! Moves like a dream 🤩🤩🤩
— Mahesh Babu (@urstrulyMahesh) September 25, 2021
