సినిమా స్థాయిలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ…. అదిరిపోయే తీర్పు చెప్పిన గ్రామ పెద్దలు

సినిమా స్థాయిలో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ…. అదిరిపోయే తీర్పు చెప్పిన గ్రామ పెద్దలు

by Anudeep

Ads

ప్రేమ 2 అక్షరాలా పదం 2 మనసులని కలిపేది అనుకుంటే మీరు పొరపాడినట్లే, మన సినిమాల్లో చూపించినట్లు ప్రేమ ఒక్కోసారి 3 మనస్సులని కూడా కలపొచ్చు. నమ్మడం లేదా అయితే కర్ణాటక లోని సకలేశపురం ప్రాంతానికి చెందిన ఒక గ్రామంలో జరిగిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి మీరు తెలుసుకోవాలసిందే. గ్రామానికి చెందిన ఒక యువకుడు అంతర్జాల మాధ్యమం ( సోషల్ మీడియా ) ఉపయోగించి అమ్మాయిలతో స్నేహం చేయడం ప్రారంభించాడు. కాలక్రమేణ ఆ స్నేహం ప్రేమగా మారింది కానీ ఇక్కడ అతను ఒక అమ్మాయితో కాకుండా ఇద్దరు అమ్మాయిలతో ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయణం సాగించాడు, చివరికి ఇద్దరూ అమ్మాయిలు ఆ అబ్బాయి చేసిన మోసం తెలుసుకున్నప్పటికీ అతనినే ప్రేమిస్తున్నామని, పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటామ్ అని అ అమ్మాయిలు అనే వరకు వాళ్ళని తీసుకువచ్చాడు.

Video Advertisement

ఈ విషయం వారి ముగ్గురి మధ్య తెలియకపోవడం వల్ల వారి కుటుంబాలు ఈ విషయాన్ని పంచాయితీ వారికీ వినిపించాయి. పంచాయతీ వారు జోక్యం చేసుకున్నప్పటికీ ఇద్దరమ్మాయిలు ఆ అబ్బాయి తనకే కావాలంటూ గొడవ చేసారు. వారి ఇరువురిలో ఎవరిని ఇచ్చి అ అబ్బాయి తో వివాహం జరిపించాలో వారికి కూడా అర్థం కాక చేసేదేమీలేక, వారే ఏదొక నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అయితే ఆ అబ్బాయి లేని జీవితాన్ని ఊహించుకోలేను అని బ్రతికితే అ అబ్బాయితోనే బ్రతుకుత అని విషం తాగింది వారిలో ఒక అమ్మాయి.

అ అమ్మాయిని హాస్పటల్లో జాయిన్ చేయగా అ అమ్మాయి తిరిగి వచ్చిన తరువాత వీరు ముగ్గురు కధ మరొకసారి పంచాయతీకి చేరింది అయితే ఈ విషయం ఇలా తీరేది కాదు అని గ్రామపంచాయతీ లాటరీ వేసి ఆ ఇద్దరు అమ్మాయిలో ఎ అమ్మాయి పేరు వచ్చినట్లయితే ఎ అమ్మాయికి అతనితో వివాహం చేస్తామని మరొక అమ్మాయి ఏమి మాట్లాడకుండా ఎలాంటి దారుణానికి పాల్పడకుండా వెళ్లిపోవాలని వారు కోరారు. దానికి అంగీకరించక వేసిన లాటరీలో విషం తాగిన అమ్మాయి పేరే వచ్చింది అయితే వేరే అమ్మాయి వీరిద్దరి పెళ్ళికి వీరికి శుభాకాంక్షలు తెలియజేసినప్పటికి తనను మోసం చేసినందుకు ఆ అబ్బాయికి తగిన శిక్ష పడాలని అందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలియజేసింది ఇదంతా చూసిన గ్రామస్తులు సినిమా స్థాయిలో వీరి కధ ఉందని ముక్కున వేలేసుకున్నారు.


End of Article

You may also like