రిపబ్లిక్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఓ వైపు సినీ సెలెబ్రిటీలు పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తుంటే.. మరో వైపు ఏపీ మంత్రుల నుంచి వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్పీచ్ పై ఏపీ మంత్రి అనిల్ విమర్శించారు.. పవన్ కళ్యాణ్ ను సంపూర్ణేష్ బాబు తో పోలుస్తూ.. మాకు ఇద్దరూ ఒకటేనని అన్నారు. ఈ కామెంట్స్ పై అభిమానుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది.

ఈ క్రమం లో టాలీవుడ్ హీరో సంపూర్ణేష్ బాబు ఈ వ్యాఖ్యలపై స్పందించారు. “మంత్రి అనిల్ గారు.. మా మంచి పవన్ కళ్యాణ్ తో నన్ను సమానం గా చూడడం సంతోషం. ఏ సమస్యకైనా పెద్ద మనసు చేసుకుని స్పందించే మా తెలుగు చిత్ర పరిశ్రమ ప్రస్తుతం చిక్కుల్లో ఉంది. ఎగ్జిబిటర్లు ఇబ్బందులలో ఉన్నారు. ముందు వారి సమస్యల్ని పరిష్కారం అయ్యేలా చూడగలరు..” అంటూ మంత్రి అనిల్ పై కౌంటర్ వేశారు.
