ఫోన్ చార్జర్ రూపం లో స్పై కెమెరా…అందరూ జాగ్రత్తగా ఉండండి

ఫోన్ చార్జర్ రూపం లో స్పై కెమెరా…అందరూ జాగ్రత్తగా ఉండండి

by Anudeep

Ads

చిత్రాలని తీయడానికి లేదా వీడియోలను చిత్రీకరించడానికి పెద్ద పెద్ద కెమెరాలు ఉపయోగించే స్థితి నుండి ఎవరికీ కనిపించని చిన్న చిన్న కెమెరాల ద్వారానే మనకు కావాల్సిన వీడియోలను చిత్రీకరించే స్థితికి టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఈ స్పై కెమెరాలను కొంతమంది అధికారుల అవినీతిని చిత్రీకరించడానికి, అన్యాయాలను చిత్రీకరించడానికి రహస్యంగా ఉపయోగించేవారు. కానీ నేటి కాలంలో వీటిని తప్పుడు మార్గంలో ఉపయోగించే వారి సంఖ్య పెరిగిపోయింది. హోటల్స్, షాపింగ్ మాల్స్, వాష్ రూమ్స్, ఎక్స్చేంజి రూమ్స్ వంటి ప్రదేశాలలో వీటిని అమర్చి అశ్లీల దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా ఇవి సైజులో చిన్నగా ఉండటం వలన వీటిని ఎక్కడైనా అమర్చ గలిగే అవకాశం ఉంది వీటిని బెడ్ లైట్, ఫ్యాన్, మిర్రర్, సీలింగ్, వాల్ పెయింటింగ్, బాత్ రూమ్స్, వాష్ బేసిన్, టేప్స్ , ఫోన్ చార్జర్ వంటి రకరకాల వస్తువులలో అమరుస్తున్నారు.

Video Advertisement

వీటిని ఒకసారి ఆ వస్తువులలో అమర్చిన తర్వాత వైఫై కనెక్షన్ ద్వారా ఎక్కడినుండైనా వాటిని ఆపరేట్ చేసే అవకాశం ఉంది ఈ కెమెరాల లో ఉండే మెమరీ కార్డు కారణంగా చిత్రీకరించిన వీడియోలు అన్నీ దానిలో సేవ్ చేయబడతాయి. అంతేకాక మొబైల్ ఫోన్ కెమెరాస్ కూడా స్పై కెమెరాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో వన్ డ్రైవ్ ఫుడ్ కోర్ట్ లో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. 18 ఏళ్లు కూడా నిండని ఒక మైనర్ బాలుడు తన మొబైల్ ని స్పై కెమెరాగా వాడి ఆడవాళ్లు ఉపయోగించే బాత్రూములో ఫిక్స్ చేసి వారి దృశ్యాలను చిత్రీకరించిన సంఘటన అందరిలో కలకలం రేపుతోంది. ఏమైనా హోటల్స్, వాష్ రూమ్స్ వంటి వాటిని ఉపయోగించే ముందు అక్కడ ఏమైనా వస్తువులు అనుమానాస్పదంగా ఉన్నాయేమో అని ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాతనే వాటిని ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. స్పై కెమెరాలను గుర్తించే అప్స్ కూడా మొబైల్లో అందుబాటులో ఉన్నాయని వాటిని ఇన్స్టాల్ చేసుకుని చెక్ చేయడం ద్వారా కూడా ఇలాంటి వాటి నుండి జాగ్రత్తగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు


End of Article

You may also like