ఆ ట్విట్టర్ అకౌంట్ లు అన్ని ఫేక్…. రెస్పాండ్ అవ్వకండి అంటూ హైపర్ ఆది లైవ్ వీడియో..

ఆ ట్విట్టర్ అకౌంట్ లు అన్ని ఫేక్…. రెస్పాండ్ అవ్వకండి అంటూ హైపర్ ఆది లైవ్ వీడియో..

by Anudeep

Ads

జబర్దస్త్ తెలుగు రాష్ట్రాలలో పరిచయం లేని పేరు ఈ జబర్దస్త్ ప్రోగ్రాం నుంచి ఎన్నో వేల స్కిట్లు, ఎందరో ఆర్టిస్టులకి లైఫ్ ఇచ్చిన వేదిక. ప్రతి గురు, శుక్రవారాల్లో తెలుగు ప్రజానీకానికి టీవీలకు అతుక్కుపోయేలా చేసే ఈ ప్రోగ్రాం. జబర్దస్త్ ప్రోగ్రాంలో పంచులు, ప్రాసలకి పెట్టింది పేరు హైపర్ ఆది. తన పంచ్ లతో ఆడియెన్స్ ని ఎప్ప్పటికప్పుడు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని..పవన్ కళ్యాణ్ తరుపున పంచుల రూపంలో అందరికి తనదైన శైలిలో సమాధానం చెప్పుతాడు..హైపర్ ఆదికి సంబంధించిన కొన్ని ట్వీట్స్  సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి .

Video Advertisement

‘పవన్ కళ్యాణ్ తప్పుచేశాడని ఏ ఒక్కడు నిరూపించినా మళ్లీ బతికి ఉండగా ఆయన పేరు ఎత్తను.. మీకే సపోర్ట్ చేస్తా.. అధికారం మీది. మీరు మగాళ్లు అయితే, ఒక అమ్మకి, అబ్బకి పుట్టుంటే నిరూపించండి” అంటూ ఒక ట్విట్..
‘చెప్పుతో కొట్టాలి ఈ లేబర్ ముండా కొడుకు పోసాని క్రిష్ణమురళిని. వాడు మాట్లాడేది వాడికే అర్థం కాదు. పవన్ కళ్యాణ్‌కి నీతులు చెప్తున్నాడు’ అంటూ హైపర్ ఆది పేరుతో ఉన్న  చాలా ట్వీట్స్ ఉన్నాయి. ఈ  విషయం మీద స్పందించిన హైపర్ ఆది ఫేస్ బుక్ లో ఒక వీడియో విడుదల చేశాడు.. “నాకు ఏ ట్విట్టర్ అకౌంట్ లేదు అని, ఆ ట్వీట్స్ చూసి నమ్మకండి.నాకు ఫేస్బుక్ తప్ప వేరే ఏ సోషల్ మీడియా అకౌంట్ లేదు. ఏదైనా ఉంటే లైవ్‌కి వచ్చి మాట్లాడతా తప్ప ఇలాంటి పోస్ట్‌లు పెట్టను.. నాకు ఎటువంటి అకౌంట్‌లు లేవు. దయచేసి ఎవరూ రెస్పాండ్ కాకండి.ఈ విషయం నేను సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకొని వెళ్తాను” అంటూ హైపర్ ఆది ఫేస్బుక్ లో వీడియో పోస్ట్ చేసాడు.

watch video :

 


End of Article

You may also like