Ads
సూర్య హీరో గా వచ్చిన సింగం 2 సినిమా గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా లో డ్రగ్స్ రవాణా చేస్తూ పట్టుబడిన నైజీరియన్ విలన్ డానీ గుర్తున్నాడు కదా.. ఆ పాత్రకు సపోర్ట్ రోల్ చేసిన మాల్విన్ తాజాగా డ్రగ్స్ కేస్ లో అరెస్ట్ అయ్యాడు. బెంగళూరు పోలీసులు ఇటీవల మాల్విన్ ను అరెస్ట్ చేసారు. సినీ ఇండస్ట్రీ లో డ్రగ్స్ దందా ఏ రేంజ్ లో నడుస్తుందో ఈమధ్య జరుగుతున్న సంఘటనలే చెప్తున్నాయి.
Video Advertisement
మాల్విన్ ఓ బిజినెస్ మ్యాన్ తో మాటు కొందరు కాలేజీకి వెళ్లే యువత కు డ్రగ్స్ అమ్ముతున్న సమయం లో బెంగళూరు పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేసారు. సింగం 2 సినిమా కాకుండా, కమల్ హాసన్ విశ్వరూపం లో కూడా మాల్విన్ నటించారు. ఇంకా కొన్ని సినిమాలలో కూడా నెగటివ్ రోల్ లోనే నటించారు. మూవీ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ఈయన డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డారు.
End of Article